Sunday, December 22, 2024

బొడ్రాయి బాగుంటే ప్రజలంతా బాగుంటారు: ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

సిఎం కెసిఆర్ నాయకత్వంలో గ్రామాల్లో సంప్రదాయాలకు పునః వైభవం వచ్చింది…

మొండ్రాయి గ్రామంలో బొడ్రాయి పండుగ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

పాలకుర్తి: కాలువ నీళ్ళు తీసుకవస్తానని 120 గ్రామాలకు మాటా ఇచ్చానని, కానీ ఇప్పుడు 100 గ్రామాలకు నీళ్ళు వచ్చాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. మిగితా గ్రామాల్లో కోర్టుకు వెళ్ళడం వల్ల పని ఆలస్యం అవుతుందని స్పష్టం చేశారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామంలో గ్రామస్తులంతా కలిసి ఘనంగా నిర్వహించుకుంటున్న బొడ్రాయి పునః ప్రతిష్ట మహోత్సవానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. బొడ్రాయి పండుగ సందర్భంగా కోలాటాలతో, అమ్మవారి బోనాలతో ఘనంగా మంత్రికి గ్రామస్తులు స్వాగతం పలికారు. మంత్రి బోనం ఎత్తుకొని బొడ్రాయి వద్దకు మహిళలతో కలిసి వెళ్లారు. అనంతరం కాలినడకన ఊరు చివర్లో ఉన్న దుర్గామాత గుడి వరకు గ్రామస్తులతో కలిసి వెళ్లి శంకుస్థాపన చేశారు. బొడ్రాయి కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు.

గ్రామ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. బొడ్రాయి తీర్చి దిద్దడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పండగ మన వెనుకటి సంప్రదాయమని, ఆ సంప్రదాయాలకు తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ నాయకత్వములో మళ్ళీ పూర్వ వైభవం వస్తుందన్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషమన్నారు. సిసి రోడ్డు మంజారు చేస్తున్నామని, ఈ మొండ్రాయిని మంచి కేంద్రంగా చేస్తామని, మొండ్రాయి అన్ని విధాల అభివృద్ది అవుతుందని హామీ ఇచ్చారు. గ్రామానికి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామన్నారు. అతి త్వరలో గ్రామానికి కాలువ నీళ్లు వస్తాయన్నారు. అయినా కోర్టులో స్టే ఎత్తి వేయించి, గ్రామస్తులను భూమి ఇవ్వడానికి ఒప్పించి పనులు చేస్తున్నాను. అప్పట్లో ఎకరానికి లక్ష రూపాయలు ఉండేదని, ఇప్పుడు ధరలు బాగా పెరిగాయని, అందుకే ఎకరానికి ప్రభుత్వం నుంచి 9 లక్షలు ఇచ్చేలా కొట్లాడానని, మొండ్రాయి చెరువుకు నీరు కచ్చితంగా తీసుకవస్తానని, మొండ్రాయి ఊరి ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నానని, మీ ఆశీర్వాదం నాకు ఉండాలని, అనంతరం గ్రామంలో దుర్గామాత గుడి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని కొబ్బరికాయ కొట్టి ఎర్రబెల్లి పూజలు చేశారు.

దుర్గామాత గుడి కట్టించడానికి అయ్యే ఖర్చు భరిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. గుడి కట్టించేందుకు గ్రామ పెద్దలు ఎవరో ఒకరు ముందుండి పనులు చేయాలని ఎర్రబెల్లి చెప్పారు. గుడి కట్టిన తర్వాత ప్రారంభోత్సవానికి వస్తానని చెప్పారు. తర్వాత గ్రామంలో అంబేద్కర్ విగ్రహ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో కాంగ్రెస్ నుంచి భారత రాష్ట్ర సమితి(బి.ఆర్.ఎస్) పార్టీలో చేరిన కార్యకర్తలకు కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో దౌపాటి ఎల్లయ్య, ఉపేందర్, సునీల్, వెంకన్న, ప్రశాంత్, కొండయ్య, పరశురాములు, దేవయ్య, రాము, లక్ష్మణ్, కిష్టయ్య, హరిబాబు, యాకన్న తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News