Saturday, December 21, 2024

కాంగ్రెస్ పార్టీలో డబ్బు సంచులకే ప్రాధాన్యం

- Advertisement -
- Advertisement -

మా జిల్లా డిసిసి అధ్యక్షుడికి జరిగిన అన్యాయానికి నిరసనగా

పార్టీకి, మెదక్ జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నా

మెదక్ జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు జై వెంకటరెడ్డి ప్రకటన

మనతెలంగాణ/హైదరాబాద్:  మెదక్ జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు జై వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. చేగుంట మండల కేంద్రంలో సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన ఆయన రాజీనామా విషయాన్ని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ కోసం 30 సంవత్సరాలుగా నిబద్ధత కలిగిన కార్యకర్తగా పని చేశానని, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కంటరెడ్డి తిరుపతిరెడ్డికి జరిగిన అన్యాయం, మోసానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

డబ్బు సంచులకే కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యతనిస్తూ ఇటీవల పార్టీలో చేరిన వ్యక్తికి మెదక్ అసెంబ్లీ టికెట్ కేటాయిస్తున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికి భవిష్యత్ లేదన్నది తేటతెల్లమైపోయిందని, డబ్బు కట్టలకు, పైరవీకారులకు టికెట్ కేటాయించడంపై మనస్తాపంతో రాజీనామా చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. మెదక్ జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్ష పదవితో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని త్వరలో ఏ పార్టీలో చేరేది ప్రకటిస్తానని ఆయన వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News