మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల సమరంలో డబ్బు అత్యంత కీలక పాత్ర పోషిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకోవడానికి, ఆకర్షించడాని కి, తమకు అనుకూలంగా ఓట్లు నమోదయ్యేటట్లుగా చేసేందుకు అభ్యర్థులు, వారి అనుచరులు డబ్బుతో పాటుగా మ ద్యం, మటన్, చికెన్, బంగారం, వెండి ఆభరణాలను పెద్ద ఎత్తున పంచుతున్నారనే విమర్శలు తారాస్థాయిలో ఉన్నా యి. డబ్బులు పంచుతూ దొరికిపోయిన వారు, డబ్బులు పంచుతూ దేవుడిపైన ప్రమాణాలు చేస్తున్న వీడియోలు, దృ శ్యాలు ఎన్నో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నా యి. అంతేగాక ఈ ఎన్నికల బరిలో ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థుల్లో సుమారు 40మంది నేతలకు కా ర్పొరేట్ స్థాయి విద్యాసంస్థలున్నాయని, తమ అధినేతల గె లుపు కోసం ఆయా విద్యా సంస్థల్లో పనిచేస్తున్న లెక్చరర్లు, టీచర్లు, ఇతర సిబ్బంది ఓటర్ల జాబితాను ఆధారంగా చేసుకొని డబ్బులు పంచుతున్న ఘటనలు కూడా బయటకొచ్చా యి. ఇలా బయటకు రాకుండా ఇంకెంత మంది ఇలా డ బ్బుల పంపిణీలో బిజీగా ఉన్నారో అర్థ్ధం ఎ న్నికల విధుల్లో పనిచేస్తున్న కొందరు సీనియర్ అధికారులు వివరించారు.
పెద్ద మొత్తాల్లోనే డబ్బులు పంచుతున్నారని, వేలాది రూపాయలను ఓట్ల కోసం వెదజల్లుతున్నారని కొం దరు పరిశీలకులుగా పనిచేస్తున్న అధికారులు వివరించా రు. హైదరాబాద్ వంటి నగరంలోని కొన్ని నియోజకవర్గా ల్లో ఓటుకు కనీసం రూ.5వేల నుంచి గరిష్టంగా రూ. 10 వేల వరకూ ధర పలుకుతోందని విమర్శలున్నాయి. హైదరాబాద్ మాత్రమే కాకుండా ఉమ్మడి వరంగల్లు జిల్లా, ఉ మ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి మ హబూబ్‌నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లోని మెజారిటీ ని యోజకవర్గాల్లో ఓటుకు 5 వేల నుంచి 10 వేల రూపాయల వరకూ డిమాండ్ పలుకుతోందని కొందరు సీనియర్ రాజకీయ నాయకులు వివరించారు. కొన్ని గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటుకు రెండు వేల రూపాయలు ధర ప లుకుతోందని, రెండు నుంచి మూడు వేలు, నాలుగువేలు, అయిదు వేల వరకూ ధరలున్నాయని అంటున్నారు. కొన్ని రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సైతం ఓటుకు 500 రూపాయల నుంచి వెయ్యి, 1500 రూపాయల వరకూ డబ్బుల పంపిణీ కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే డబ్లు కోసం ఓటర్లు డిమాండ్ చేయడమే కాకుండా స్థానికంగా ఉన్న నాయకులపైన కూడా తిరగబడుతున్నారని, ఫలానా కు టుంబానికి డబ్బులు ఇచ్చి మాకెందుకు ఇవ్వడంలేదని స్థా నిక నేతలను నిలదీయడమే కాకుండా గొడవపడి మరీ డ బ్బులు వసూలు చేస్తున్నారని సమాచారం.
ఇలా డబ్బును డిమాండ్ చేయడం ఎంతదాకా పోయిందంటే పక్కనుంచి ఎవ్వరైనా వీడియోలు తీస్తున్నారా… పొటోలు తీస్తున్నారా… విలేకరులు అడుగుతున్నప్పటికీ ‘ఏదో సినిమా బాగుంది అన్నట్లుగా ఇంటర్వూల్లోనే బహిరంగంగానే చెబుతున్నారని’… ఇటీవల సిద్దిపేట జిల్లాలో ఇలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయాన్ని ఆ నాయకులు గుర్తుచేశారు. ఇలా డబ్బులు వసూలు చేసిన ఓటర్లు తమ ఓట్లను ఎవ్వరికి వేస్తారో… అంతుబట్టడంలేదని పలువురు నాయకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మరికొందరు స్థానిక నాయకులు ఓటర్లకు డబ్బులు పంచుతూనే దేవుడిపైన ప్రమాణాలు చేయిస్తున్నారని, అయినప్పటికీ ఈ ప్రమాణాలను పూర్తిగా విశ్వసించడానికి కూడా వీల్లేదని అంటున్నారు. డబ్బులిచ్చినా, ప్రమాణాలు చేయించినా ఓట్లు తప్పకుండా తమ పార్టీ అభ్యర్థికే ఓటు వేస్తారనే నమ్మకం… భరోసా… కూడా లేకుండా పోతోందని ఆ నాయకులు మదనపడుతున్నారు. పైగా కొన్ని పార్టీల నాయకులు డబ్బులు తీసుకున్నప్పటికీ తమ పార్టీకే ఓట్లు వేయాలని కోరడంతో ఓటర్ల అభిమానం ఎటువైపుకు మొగ్గుతుందోనని ఆ నేతలు టెన్షన్ పడుతున్నారు. డబ్బుల పంపిణీ ప్రక్రియ ఇలా ఉండగా వెండి వస్తువులు, బంగారు ఆభరణాలను కూడా ఓటర్లు డిమాండ్ చేస్తున్నారని పలువురు సీనియర్ నేతలు వివరించారు.
అయితే బంగారం ధరలు ఆకాశాన్నంటాయని, అందుచేతనే రూ.2వేల నుంచి రూ.5వేల వరకూ విలువ చేసే వెండి వస్తువులను కొందరికి పంచుతున్నారని వివరించారు. ఈ ఎన్నికల సమయంలో మద్యం పంపిణీ కార్యక్రమాలు అత్యంత పగడ్బందీగా, మరింత గోప్యంగా, కట్టుదిట్టంగా జరుగుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ నాటికే మద్యం బాటిళ్లు గ్రామాల్లోకి వచ్చాయని, లోకల్ గోడౌన్లలో లారీలకు లారీల మధ్యం దిగుమతి జరిగిందని, కేవలం పోలింగ్ సమాయంలోనే కాకుండా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం నుంచే కార్యకర్తలు, నియోజకవర్గాల్లోని ద్వితీయశ్రేణి నాయకుల కోసం మద్యం దిగుమతి చేసుకోవాల్సి వచ్చిందని, మందు, -చికెన్-, మటన్- బిర్యానీలు లేకుండా ఈ రోజుల్లో ఎవ్వరూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం లేదని, అందుకనే ఎంత ఖర్చయినా వెనుకాడకుండా ఈ ప్రాథమిక ఏర్పాట్లు చేయాల్సి వచ్చిందని ఆ నాయకులు వివరించారు. పార్టీ ఏదైనప్పటికీ ఈ విధమైన ఏర్పాట్లు తప్పనిసరిగా చేయాల్సిందేనని, సిద్దాంతాలు, క్రమశిక్షణలు ఈ ఎన్నికల సమయంలో పనిచేయవని అంటున్నారు. తెలంగాణతో చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల నుంచి క్వార్టర్ బాటిల్స్‌లో విస్కీ, బ్రాందిలను (సెకండ్స్) లారీలకు లారీలను రప్పించుకొన్నారని వివరించారు.
మద్యం తయారుచేసే డిస్టిల్లరీల నుంచి నేరుగా లారీల్లో మద్యం తరలింపు జరిగిందని, నామినేషన్లు ముగిసిన వెంటనే కొన్ని డిస్టిల్లరీలకు ప్రత్యేకంగా ఆర్డర్‌పెట్టి మరీ తయారు చేయించుకొని బాటిళ్ళను తెప్పించుకొన్నామని వివరించారు. సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ విభాగం స్టాంపింగ్‌లు లేకుండా డిస్టిల్లరీల నుంచి దొడ్డిదారిన లారీలకు లారీల మద్యం బయటకు వస్తుంటాయని వివరించారు. అంతేగాక రాష్ట్ర ఎక్సైజ్ శాఖ, పోలీసులు, చెక్‌పోస్టులు అన్నింటినీ దాటుకొని వచ్చాయని వివరించారు. అందుకే ఈ ఎన్నికల సమరంలో మద్యం ఏరులై పారుతూనే ఉందని అంటున్నారు. ఎన్నికల సంఘం ఎన్నిరకాలుగా, ఎంత పగడ్బందీగా ఏర్పాట్లు చేసినప్పటికీ డబ్బు పంపిణీ, మద్యం పంపిణీలను అరికట్టడం సాధ్యం కాదని, అవన్నీ ప్రజలకే (ఓటర్లు) ఎక్కువ అవసరమని, ఈ ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యమే అధికంగా ఉంటుంది గనుక ఎన్నికల సంఘం అధికారులకు దొరికిపోయే అవకాశాలే లేవని ఆ నాయకులు ధీమాగా చెబుతున్నారు. అంతా బహిరంగమేనని… ఇందులో ఏదీ దాపరికం లేదని… అంటున్నారు. అందుకే ఎవ్వరూ కిమ్మనకుండా గోప్యతను పాటిస్తుంటారని… ఇక ఎన్నికల సంఘం అధికారులు, పరిశీలకులకు ఎలా తెలుస్తుంది… అని ఆ నాయకులు ఎదురు ప్రశ్న వేస్తున్నారు.