Sunday, December 22, 2024

అక్కడ వేలిముద్ర వేశారు… ఇక్కడ డబ్బులు మాయం…

- Advertisement -
- Advertisement -

అమరావతి: కులగణన చేసినప్పుడు కొందరు వేలిముద్ర వేయడంతో వారి బ్యాంకు ఖాతాలో నుంచి డబ్బులు డ్రా చేసినట్టు వాళ్ల ఫోన్లకు సందేశాలు వచ్చిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కులగణనలో భాగంగా సచివాలయం సిబ్బంది పొడగట్లపల్లి గ్రామంలో ఇంటింటికి వెళ్లి వేలి ముద్రలు తీసుకున్నారు. వేలిముద్రలు వేసిన తరువాత కొందరి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు డ్రా చేసినట్టుగా సందేశాలు రావడంతో బ్యాంకులకు ఖాతాదారులు పరుగులు తీశారు. అలాగే ఓ వ్యక్తి రావులపాలెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భూమి కొనుగోలు చేసినప్పుడు ఈకెవైసి కోసం వేలిముద్ర వేశాడు. కొద్దిసేపటి తరువాత ఆయన ఖాతా నుంచి డబ్బు డ్రా చేసినట్టుగా సందేశం రావడంతో బ్యాంక్‌కు పరుగు తీశాడు. బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. 25 మంది ఖాతాల నుంచి డబ్బు డ్రా అయినట్టుగా వచ్చిందని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News