- Advertisement -
రాజకీయ నాయకులు ఓట్లను డబ్బుతో కొనుగోలు చేయడం, ప్రారంభించడంతో ప్రజాస్వామ్యం పక్కదారిపడుతోంది. తమ బాధ్యతగా వేయాల్సిన ఓటును డబ్బులను ఎరగా చూపడంతో కొందరు ఓటర్లు డబ్బులిస్తే తప్ప ఓటు వేయలేని పరిస్థితి నెలకొంది. కొందరు రాజకీయ నాయకులు ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు కాని ఎన్నికల్లో గెలవాలని పట్టుదలగా ఉండడంతో ఈ ఎన్నికల్లో డబ్బు ఏరులై పారింది.
పోలీసులు తనిఖీలను ముమ్మరం చేయడంతో కొత్తదారుల్లో నగదును సరఫరా చేసేందుకు మొగ్గుచూపారు. దానిలో భాగంగానే హవాలా ఏజెంట్లను ఆశ్రయించారు. దొరికితే వారిపైనే కేసు నమోదవుతుంది, ఇందులో రాజకీయ నాయకులకు సంబంధంలేకపోవడంతో వారు దీని వైపు మొగ్గు చూపారు. కానీ పోలీసులు హవాలా వాపారులపై ఓ కన్నేసి ఉంచడంతో వారి ఆట కట్టైంది.
- Advertisement -