Sunday, January 19, 2025

పేడ కుప్పలో రూ.20 లక్షలు దాచి…

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: పేడ కుప్పలో రూ.20 లక్షలు దాచిపెట్టిన సంఘటన ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఒడిశాకు చెందిన గోపాల్ అనే వ్యక్తి హైదరాబాద్‌లోని ఆగ్రో బేసిడ్ కంపెనీలో పని చేసేవాడు. కంపెన్ లాకర్ నుంచి రూ.20 లక్షలు తీసుకొని తన సోదరుడు రబీంద్ర సహాయంతో తన సొంతూరు బదమందరుణి గ్రామానికి తరలించారు. ఆ డబ్బులు ఇంట్లో ఉన్న పేడ కుప్పలో దాడి పెట్టారు. ఆగ్రో బెసిడ్ కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఒడిశాలోని కమర్దా పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. స్థానిక పోలీసుల సహాయంతో గోపాల్ ఇంట్లో వెతకగా పేడ కుప్పలో రూ.20 లక్షల రూపాయలు దొరకడంతో స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం గోపాల్, రబీంద్ర పరారీలో ఉండడంతో వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News