- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: గృహలక్ష్మీ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు విడతల వారీగా వారి ఖాతాల్లో డబ్బులను ప్రభుత్వం జమ చేయనుంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే మంజూరు పత్రాల పంపిణీ కొనసాగుతుండగా, త్వరలోనే ఒక్కో నియోజకవర్గానికి 3 వేల మంది చొప్పున మొత్తం 3,65,975 మంది లబ్ధిదారు లను గుర్తించి, మంజూరు పత్రాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది.
మరో 35 వేల మందిని సిఎం కోటా కింద లబ్ధిదారులుగా ఎంపిక చేయనుంది. నిరుపేదల సొంతింటి కల సాకారం చేసేందుకు ప్రభుత్వం గృహలక్ష్మి పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని పేదలకు గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు ఇప్పటికే దరఖాస్తులు కూడా స్వీకరించిన విషయం తెలిసిందే.
- Advertisement -