Monday, November 25, 2024

చైనీస్ వీసా స్కామ్.. కార్తి చిదంబరంపై మనీలాండరింగ్ కేసు

- Advertisement -
- Advertisement -

Money laundering case against Karti Chidambaram

న్యూఢిల్లీ : చైనీయులకు వీసాలను మంజూరు చేయడానికి సంబంధించిన కుంభకోణం కేసులో కార్తి చిదంబరంతోపాటు మరి కొందరిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసును నమోదు చేసింది. 2011 లో కేంద్ర హోం మంత్రిగా పి. చిదంబరం పనిచేసిన కాలంలో ఈ కుంభకోణం జరిగినట్టు ఆరోపించింది. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దాఖలు చేసిన కేసు ఆధారంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) ప్రకారం ఈ కేసును నమోదు చేసింది. ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సిబిఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈ కేసును నమోదు చేశారు. వేదాంత గ్రూప్ కంపెనీ తల్వండి సబో పవర్ లిమిటెడ్ పంజాబ్‌లో ఓ విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేసింది. ఈ సంస్థకు చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్ రూ. 50 లక్షలు లంచం కార్తి చిదంబరానికి , ఆయన సన్నిహితుడు ఎస్ భాస్కరరామన్‌కు చెల్లించారు. ఈ నేర ప్రతిఫలంపై ఈడీ దర్యాప్తు చేస్తుంది. దర్యాప్తులో భాగంగా నిందితులను ప్రశ్నిస్తుంది. ఇదిలా ఉండగా కార్తి చిదంబరం మాట్లాడుతూ ఈడీ ఆరోపణలను తోసిపుచ్చారు. ఇవి వేధింపులు కాకపోతే మరేమిటని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News