Saturday, December 21, 2024

వడ్డీ వ్యాపారుల వేధింపులు.. పోలీసులకు బాధితుల ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అప్పు ఇచ్చి అధిక వడ్డీ తీసుకుంటూ వేధింపులకు దిగుతున్న భార్యభర్తపై బాధితులు ఆదివారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12 ఎన్‌బిటి నగర్‌లో ఉంటే వెంకట్‌రెడ్డి, అతడి భార్య నర్మద కాలనీలో పలువురుకి అధిక వడ్డీకి అప్పులు ఇస్తున్నారు. ఎక్కువ డబ్బులు అప్పు తీసుకున్న వారి వద్ద నుంచి ఇళ్ల పత్రాలు తనఖా పెట్టుకుని అప్పు ఇస్తున్నారు.

అయితే బాధితులు అప్పు తీర్చినా కూడా ఇంటి పత్రాలు ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నారు. అప్పు కట్టని వారి ఇళ్లను స్వాధీనం చేసుకుని వేధిస్తున్నారు. వీరి వేధింపులకు తాళలేక బాధితులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై 420,384 ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News