రాయ్‌పూర్: ప్రియురాలుకు ఇచ్చిన డబ్బుల విషయంలో గొడవ జరగడంతో ప్రియుడ్ని ఆమె చంపి, మృతదేహాన్ని డ్రమ్ములో కుక్కి తగలబెట్టిన సంఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాజ్‌నంద్‌గావ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చంద్రభూషణ్ అనే వ్యక్తికి రాగిణి అనే ప్రియురాలు ఉంది. ప్రియురాలుకు అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చాడు. తన డబ్బులు తనకు ఇవ్వాలని ప్రియురాలిని ప్రియుడు అడిగాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో ఆమెను ప్రియుడు వేధించాడు. దీంతో హత్య చేయాలని ప్రియురాలు నిర్ణయం తీసుకుంది.
సాహూ అనే స్నేహితుడితో కలిసి భూషణ్‌ను హత్య చేశారు. మృతదేహాన్ని డ్రమ్ములో కుక్కి అటవీ ప్రాంతంలో పడేశాడు. మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. అటవీ ప్రాంతంలో మృతదేహం కనిపించడంతో స్థానిక రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదే సమయంలో భూషణ్ కనిపించడంలేదని అతడి కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సగం కాలిన మృతదేహాన్ని అతడి కుటుంబ సభ్యులకు చూపించడంతో భూషణ్‌గా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు రాగిణిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా తానే హత్య చేశానని ఒప్పుకుంది. వెంటనే ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.