Wednesday, January 22, 2025

రైతుల ఖాతాల్లో వెంటనే డబ్బులు జమ చేయాలి

- Advertisement -
- Advertisement -

కేసముద్రం: యాసంగిలో ప్రభుత్వం రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి నేటికి డబ్బులు చెల్లించడం లేదని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి మహేందర్‌రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు తోట వెంకన్న, టిపిసిసి సభ్యులు దస్రూనాయక్‌లు అన్నారు. ఈ సందర్భంగా కేసముద్రం తహసీల్దారు కార్యాలయంలో శుక్రవారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అరకొరక వసతులతో ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అమ్మడానికి పడిగాపులు కాసి, తీరా కాంటాలు నిర్వహించిన తర్వాత కూడా నేటికి రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయలేదని విమర్శించారు. దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్న ప్రభుత్వం రైతుల గోసను పట్టించుకునే స్థితిలో లేదు.

వడగళ్లతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు పదివేలు వస్తాయని బీరాలు పలికుతూ మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు అల్లం నాగేశ్వర్‌రావు, పోలెపాక నాగరాజు, ఎస్టీసెల్ నాయకులు ఇస్లావత్ చందు, బాలు నాయక్, బానోత్ చిన్న వెంకన్న, చిట్ల సంపత్, షేక్ ముజ్జు, కళ్ళెం శ్రీనివాస్, కీర్తి సురేందర్, పరాంకుశం శ్రీహరి, యార సాగర్, సామ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News