Sunday, December 22, 2024

డబ్బులు దాచుకోవాలి… శరీర క్యాలరీలు ఖర్చు చేయాలి

- Advertisement -
- Advertisement -
  • స్వచ్ఛ హుస్నాబాద్ చైతన్య 10కె రన్
  • ఆగస్టు 6న రంగనాయక సాగర్ ప్రాజెక్ట్‌పై హాఫ్ మారథాన్
  • ఆరోగ్య పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలి: సిపి శ్వేత

హుస్నాబాద్: సమాజంలో ప్రతి ఒక్కరూ డబ్బులు ఉంటే దాచుకోవాలని శరీరంలో ఉండే క్యాలరీలు ఖర్చు చేయాలని సిపి శ్వేత అన్నారు. హుస్నాబార్ రన్నర్స్ అసోసియేషన్, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని ఏనే వద్ద నిర్వహించిన 10కె రన్‌ను అదనపు డిసిపి మహేందర్‌తో కలిసి ప్రారంభించారు. ఏనే వద్ద నుంచి జనగామ క్రాస్ రోడ్డు నుంచి మరల ఏనే వరకు ప్రమోషనల్ రన్ కొనసాగింది. ఆరోగ్య హుస్నాబాద్‌లో భాగంగా స్వచ్ఛ హుస్నాబాద్ చైతన్యాన్ని అందరికి తెలియపరిచే విధంగా రన్ నిర్వహించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలని అన్నారు. ఆరోగ్యాన్ని మించింది మరోకటి లేదని ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు.

ప్రతిరోజు ప్రతిఒక్కరూ ఆరోగ్య సంరక్షణకి వాకింగ్, రన్నింగ్, యోగ, ద్యానం , స్విమ్మింగ్ అలవర్చుకోవాలని సూచించారు. మన కుటుంబం మన ఆరోగ్యం కోసం రోజులో ఒక గంట సమయం కేటాయించుకోవాలన్నారు. మంత్రి హరీశ్‌రావు చొరవతో ఆగస్టు 6న రంగనాయక సాగర్ ప్రాజెక్టుపై నిర్వహిస్తున్న హాఫ్ మారథాన్ రన్‌లో యువతి, యువకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో అద్భుతంగా నిర్వహించడం జరుగుతుందని దానిలో బాగంగా హుస్నాబాద్‌లో 10కె రన్ ప్రమోషనల్ రన్ నిర్వహించడం జరిగిందన్నారు.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ లింక్ https://shm23.iq301.com ఓపెన్ చేసి వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని ఆఫ్ మారథాన్ రన్‌లో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. అనంతరం యువతి, యువకుల విభాగంలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకుల రజిత, వైస్ చైర్మన్ ఐలేని అనిత, ఎఎంసి చైర్మన్ ఎడబోయిన రజని, హుస్నాబాద్ ఎసిపి వాసాల సతీష్, సిఐ కిరణ్, ఎస్‌ఐ మహేశ్, అక్కన్నపేట ఎస్‌ఐ వివేక్, హుస్నాబాద్ రన్నర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఆకుల వెంకట్, అధ్యక్షుడు రమేశ్, సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కత్తుల బాపురెడ్డి, మాజీ ఎఎంసి చైర్మన్ ఎడబోయిన తిరుపతిరెడ్డి, పట్టణ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News