చాంద్రాయణగుట్ట: తీసుకున్న అప్పు చెల్లించకుండా బండి అడుగుతున్నావా అంటూ ఒక వడ్డీ వ్యా పారి మేస్త్రీపై కత్తితో దాడిచేసిన సంఘటన ఛత్రినాక పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ భోజ్యా నాయక్ కథనం ప్రకారం… ఉప్పుగూడ కృష్ణారెడ్డినగర్‌కు చెందిన యాదయ్య (30) సిక్‌చావునీలో ఉండే మహేందర్ అనే వడ్డీ వ్యాపారి వద్ద ఐదు వేల రూపాయ లు అప్పు తీసుకున్నాడు. తీసుకున్న అప్పు చెల్లించటానికి తగిన గ డువు పెట్టాడు. అయితే ప్రతినెల చెల్లించాల్సిన డబ్బులు యాదయ్య చెల్లించటం లేదు. దీంతో మహేందర్, యాదయ్య ద్విచక్ర వాహనాన్ని లాక్కున్నాడు. మద్యం మత్తులో ఉన్న యాదయ్య, మహేందర్ ఇం టికి వెళ్ళి బండి ఇవ్వమని అడిగాడు. అందుకు ఆగ్రహించిన మహేందర్, యాదయ్యపై కత్తితో దాడి చేశాడు.
తీవ్ర గాయాలైన యాదయ్య ఇంటికి వచ్చి అలాగే పడుకున్నాడు. గాయం నుండి రక్తం పారి ఇళ్ళంతా మడుగుకట్టింది. ఈ విషయం గమనించిన స్థానికులు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్ళారు. ఇన్‌స్పెక్టర్ భోజ్యా నాయక్ సం ఘటనా స్థలాన్ని సందర్శించారు. బాధితుడిని వెంటనే ఉస్మానియాకు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.