Monday, December 23, 2024

మీ విధానాలకు మేం ఫిదా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి రాకముందు తాము 8 రాష్ట్రాలు పర్యటించామని, కానీ తమ పరిశ్రమ ఏర్పా టుకు ఎక్కడా అనూకూల పరిస్థితి కనిపించ లేదని మోనిన్ గ్రూప్ చైర్మన్ ఆలివర్ మోనిన్ అన్నారు. సంగారెడ్డి జిల్లాలో తమ యూనిట్ శంకుస్థాపన కార్యక్రమంలో అయన మాట్లా డారు. తాము పర్యటించిన రాష్ట్రాలో పోలిస్తే ఇక్కడ పారిశ్రామిక మౌలిక పరిస్థితులు ఎం తో బాగున్నాయన్నారు. ముఖ్యంగా మీరు పరిశ్రమలను ప్రోత్సహిస్తున్న తీరు, మీ విజన్ మాకు ఎంతగానో
నచ్చిందని అందుకు ఇక్కడ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు.

అనంతరం మేనేజింగ్ డైరక్టర్ ఇండికా జర్మన్ ఔరాద్ మాట్లాడుతూ ..భారత దేశ పర్యటనలో( ఇన్వైట్ ఇండియా )భాగంగా తము 10 రాష్ట్రాల్లో వెయ్యి సార్లు పర్యటించామని, తెలంగాణలో కనిపించిన పారిశ్రామిక అనుకూలతలు తమకు ఎక్కడా కనిపించలేదన్నారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రపంచ స్థాయి మౌలిక వసుతులు కల్పించడం తమను ఆశ్చర్య పరచడమే కాకుండా చాలా సంతోషంగా కూడా అనిపించినట్లు చెప్పారు. ముఖ్యంగా పరిశ్రమల అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు అత్యద్భుతంగా ఉన్నాయని అందుకు తమ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News