Monday, December 23, 2024

పసిబిడ్డను కోతి ఎత్తుకెళ్లి… కిందపడేయడంతో

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆరుబయటక మంచం మీద పడుకోబెట్టిన పసికందును కోతి ఎత్తుకెళ్లి కిందపడేయడంతో పాప మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా పిసి పల్లి మండలం మురుగమ్మి గ్రామంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… రవీంద్ర, సుమతి అనే భార్యభర్త ఇద్దరు కుమార్తెలతో కలిసి జీవనం సాగిస్తున్నారు. చిన్న కుమార్తె రెండు నెలల నుంచి మూడో నెల వయసు ఉంటుంది. ఆరు బయట మంచం మీద పాపను పడుకోబెట్టిన తల్లి ఇంటి పనుల్లో చేస్తుంది. అదే సమయంలో కోతి పాపను ఎత్తుకెళ్లడంతో ఏడుపు వినిపించింది. వెంటనే తల్లి అప్రమత్తమై కోతి వద్దకు వెళ్లింది. కోతి ఆ పాపను కొంచెం ఎత్తుకు తీసుకెళ్లి ఇనుప సామాగ్రిపై పడేయడంతో పాప తలకు తీవ్రగాయమైంది. రక్తపు మడుగులో ఉన్న పాపను చూసి తల్లి రోదించింది. పాపం కొంచెంసేపటి తరువాత మృత్యువాతపడింది. దీంతో ఇంట్లో విషాదచాయలు అలుముకున్నాయి.

ఉదయాన్నే లేచి ఇళ్లముందు ఊడ్చి కళ్ళాపి చల్లుకోవాలన్నా కోతుల గుంపులు పోయేదాకా ఆగాల్సివ స్తోందని మ హిళలు అంటున్నారు. పప్పులు ఇతరవస్తువులు ఎండ బెట్టాలన్నా కోతుల భయంతో ఎండబెట్టడంలేదని అం టున్నారు. నేరుగా ఇళ్లలోకి చొరబడి వాటికి అందిన తినుబండారాలను అందుకొని వెళ్తునాయని కొట్టబోతే మీదకు వస్తున్నాయని ఇళ్ళలోని వారు చెపుతు న్నా రు. చిన్నపిల్లలు, వృద్దుల పైకి కోతులు దాడులు చేసిన సంఘటనలు అనేకం వున్నాయని అంటు న్నారు. ఆరు బయట బట్టలు ఆరవేసినా ఎత్తుకెళ్లి చింపి చెట్లకొ మ్మలపై వేస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. వ్యవ సాయ క్షేత్రాల్లో ఎలాంటి పంటలు లేకపోవడంతో అడవి నుండి తారు రోడ్డుపైనే ఎంచక్కా గ్రామల్లోకి ప్రవేశస్తున్న కోతుల గుంపులను చూస్తేనే వణుకు పు డు తోందని రాను రాను గ్రామాలన్నీ కోతుల మ య ంగా మరే ప్రమాదం వుందని అంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News