Tuesday, December 24, 2024

తెలంగాణలో మంకీపాక్స్ అనుమానిత కేసు నమోదైంది: ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో మంకీపాక్స్ అనుమానిత కేసు నమోదైందని ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ శంకర్ తెలిపారు. ఈ నెల 6న బాధితుడు కువైట్ నుంచి వచ్చాడని, రోగి ముందుగా కామారెడ్డిలో ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాడని, బాధితుడు నీరసం, జ్వరంతో ఉన్నాడని తెలిపారు. శరీరంపై ఉన్న దద్దుర్లు మంకీపాక్స్ మాదిరిగా ఉన్నాయని, రోగి నుంచి ఐదు రకాల నమూనాలు సేకరించామని ఫీవర్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. నమూనాలను పుణెలోని ఎన్‌ఐవికి పంపిస్తామన్నారు. రోగితో కాంటక్ట్ అయిన ఆరుగురిని కామారెడ్డిలో ఐసోలేషన్‌లో ఉంచామన్నారు. ప్రజలు ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రోగికి అతి దగ్గరగా ఉన్నవారికే వ్యాధి వచ్చే అవకాశం ఉందన్నారు. గాలి ద్వారా మంకీపాక్స్ సోకదన్నారు. మంకీపాక్స్ లక్షణాలతో విదేశాల నుంచి వచ్చిన వారు సమాచారం ఇవ్వాలన్నారు. 6 నుంచి 13 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడుతాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News