Monday, December 23, 2024

ఢిల్లీలో ఏడుకు పెరిగిన మంకీపాక్స్ కేసులు!

- Advertisement -
- Advertisement -

 

Monkey pox case in Delhi

న్యూఢిల్లీ: ఢిల్లీలో మరో మంకీపాక్స్ కేసు వెలుగుచూడ్డంతో ఆ వ్యాధి బాధితుల సంఖ్య 7కు పెరిగింది. 24 ఏళ్ల నైజీరియా మహిళ మంకీపాక్స్ లక్షణాలైన జ్వరం, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలతో లోక్‌నాయక్ ఆస్పత్రిలో చేరింది. కాగా ఆమె నమూనాలను వైద్యులు పూణె వైరాలజీ ల్యాబ్‌కు పంపగా…పాజిటివ్ అని వచ్చింది. దాంతో ఆమెకు సన్నిహితంగా కలిసిమెలసి ఉన్న వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఢిల్లీలోని ఏడు మంకీపాక్స్ కేసుల్లో ముగ్గురు పురుషులు కాగా, నలుగురు మహిళలు. ఐదుగురు ఇప్పటికే కోలుకున్నారు. మిగతా ఇద్దరు ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నారు. ఇదిలావుండగా కేరళలో ఇప్పటి వరకు ఐదు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News