- Advertisement -
హైదరాబాద్: దేశంలో మంకీ పాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. ఇందులో భాగంగానే నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో 36 పడకలతో మంకీ పాక్స్ ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చే వాళ్లకు మంకీ పాక్స్ లక్షణాలు బయటపడితే ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఈ వార్డుకు తరలిస్తారు. అనుమానితుల రక్తం, యూరిన్, గొంతు నుంచి ఐదు రకాల శాంపిల్స్ తీసి గాంధీ దవాఖానకు పంపిస్తారు. వచ్చే ఫలితాల్లో అనుమానాలుంటే శాంపిల్స్‌ను మరోక్కసారి పుణెకు పంపుతామని ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ వెల్లడించారు. వ్యాధి లక్షణాలు ఉంటే ఈ వార్డులో ప్రత్యేక చికిత్స అందించనున్నట్లు డాక్టర్ కె. శంకర్ పేర్కొన్నారు.
- Advertisement -