Friday, December 20, 2024

కామారెడ్డిలో మంకీపాక్స్ కలకలం…

- Advertisement -
- Advertisement -

Monkeypox2

కామారెడ్డి: ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీ పాక్స్ భారత్‌కు కూడా వ్యాపించింది. ఇప్పటికే నాలుగు కేసులు నమోదు అయ్యాయి. ఇవాళ ఢిల్లీలో ఓ వ్యక్తికి మంకీ పాక్స్ నిర్ధారణ అయింది. ఇదిలా ఉంటే కామారెడ్డి జిల్లాలో మంకీ పాక్స్ కలకలం రేగింది.  ఇంద్రానగర్ కాలనీలో ఓ వ్యక్తికి మంకీ ఫాక్స్ సోకినట్లు అనుమానం వ్యక్తమైంది. దాంతో ఆయనను వైద్యులు ఈ నెల 20 నుంచి అబ్జర్వేషన్‌లో ఉంచారు. మంకీ ఫాక్స్‌గా అనుమానించి బాధితుడిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నుంచి హైదరాబాద్  తరలించారు. జలుబు, దగ్గు లక్షణాలు కనిపించడంతో వ్యక్తి నుంచి శాంపిల్స్ తీసుకుని పరీక్షలకు పంపారు. హైదరాబాద్ నుంచి ఫలితాలు వచ్చాక కానీ అతనికి మంకీపాక్స్ ఉందో లేదో తేలాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News