Wednesday, January 22, 2025

యూరప్ గడగడ

- Advertisement -
- Advertisement -

Monkeypox from Canada to America

కెనడా నుంచి అమెరికాకు మంకీపాక్స్
1958లో తొలుత కోతులలో
70లో మొదటిసారి మనుష్యులకు
ప్రాణాంతకమేమీ కాదు
నిర్లక్ష్యంతో తప్పని ముప్పే

న్యూయార్క్ : మనిషి ఆరోగ్యానికి చేటుగా మారిన మంకీపాక్స్ ఇప్పుడు అమెరికాలో కూడా తలెత్తింది. యూరప్‌లో ఈ అంటువ్యాధి కేసులు అనేకం రికార్డు అయ్యాయి. ఇప్పుడు పొలిమేరలు దాటుకుని ఇప్పుడు అమెరికాలోనూ ఇది పాగా వేసినట్లు నిర్థారణ అయింది. వ్యాధుల నియంత్రణ నిరోధక కేంద్రాలు (సిడిసి) అమెరికాలో ఇప్పుడు ఈ మంకీపాక్స్ కేసుల గురించి తెలిపింది. మసాచ్‌సెట్స్‌కు చెందిన ఓ వ్యక్తికి ఈ వ్యాధి వచ్చింది. ఆ వ్యక్తి ఇటీవలే కెనడాకు వెళ్లి వచ్చాడు. ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందడం జరిగింది. ఈ కేసు అమెరికాలో ఇది ఈ ఏడాది తొలి మంకీపాక్స్ వైరస్ సంక్రమణం అయింది. అయితే దీని వల్ల ఇతరులకు ఎటువంటి ముప్పు తలెత్తలేదు. బ్రిటన్‌లో ఏడు, పోర్చుగల్, స్పెయిన్‌లలో మరికొన్ని కేసులు వెలుగులోకి వచ్చిన తరువాత అమెరికాలో మంకీపాక్స్ ఉనికి నిర్థారణ అయింది. అయితే కెనడాలోని మాంట్రియల్ ఇప్పటికే 13 కేసులు వెలుగులోకి వచ్చినట్లు వీటిపై అక్కడి వైద్య పరిశోధనల విభాగం దృష్టి సారించినట్లు వెల్లడైంది.

మంకీపాక్స్ అంటే ఏమిటీ?

మంకీపాక్స్ అత్యంత అరుదైన సాధారణంగా స్వల్పస్థాయి సంక్రమణ వ్యాధిగా తలెత్తుతుంది. ఆఫ్రికాలోని కొన్ని రకాల జంతువుల ద్వారా ఇది మనిషికి వ్యాపిస్తుంది. 1958లో ఇది తొలిసారిగా కోతులలో తలెత్తింది. దీనితో ఈ వైరస్‌ను మంకీపాక్స్‌గా పిలుస్తున్నారు. తరువాత దీనిపై పరిశోధనలు చేపట్టారు. 1970లో ఇది తొలిసారి మనుష్యులకు సోకింది. స్మాల్‌పాక్స్ లేదా మశూచి సంబంధిత వ్యాధి ఇది అని , ముఖంపై నల్లటి మచ్చలు తలెత్తుతాయని తరువాత ఇవి శరీరంపై విస్తరిస్తాయని సిడిసి తెలిపింది. బ్రిటన్‌లోని జాతీయ ఆరోగ్య సేవల విభాగం వెబ్‌సైట్ కూడా దీనిని ధృవీకరించింది. మంకీపాక్స్ సోకిన జంతువులు కాటువేస్తే సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ వ్యాధి మనుష్యులకు సోకుతుంది. లేక వ్యాధితో ఉన్న జంతువుల రక్తం లేదా ద్రవాలు లేదా వాటిపై ఉండే జూలు సోకితే ఇది వస్తుంది. ముందు ఇది ఎలుకలు , ఉడుతల వంటి వాటితో కూడా వస్తుందని తేలింది. ఇది నిర్థారణ కాలేదు. మంకీపాక్స్ మనుష్యుల నుంచి మనుష్యులకు ఎక్కువగా సోకే ప్రమాదం ఏమీ లేదు. అయితే ఇది వచ్చిన వారు వాడే దుస్తులు లేదా వారిని స్పర్శిస్తూ ఉంటే ఇతరులకు కూడా ఇది వ్యాపిస్తుందని తేలింది.

జ్వరం నొప్పి లక్షణాలు

ముందు జ్వరం , తలనొప్పి, కండరాల పోట్లు, వెన్నునొప్పి, గ్రంధులు వాయడం, వణుకుడు, నిస్పత్తువలు కలుగుతాయి. తరువాత 21 రోజులకు కానీ ఈ మంకీపాక్స్ విరుచుకుపడదు. ఈలోగా అవలక్షణాలను గుర్తించి నివారణ చర్యలు తీసుకుంటే దీని బారి నుంచి బయటపడుతారు. మధ్య ఆఫ్రికాలో జరిపిన అధ్యయనంలో ఈ మంకీపాక్స్ సోకిన పది మందిలో ఒక్కరు మృతి చెందినట్లుగా నిర్థారణ అయింది. సరైన ఆరోగ్య చికిత్సలు లేని దేశంలో ఈ పరిణామం ఉంది. అయితే ఇతర చోట్ల తగు విధంగా చికిత్స జరిగితే కొద్ది వారాలలో దీని నుంచి కోలుకుంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే ఇప్పటి పరిస్థితులలో ఎటువంటి సంక్రమిత వ్యాధులు పట్ల అయినా సరైన జాగ్రత్తలు తీసుకుని తీరాలని లేకపోతే అవి ప్రాణాంతకం అవుతాయని, ముదురుతాయని హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News