Monday, December 23, 2024

ఢిల్లీలో ఆఫ్రికన్ యువతికి మంకీపాక్స్

- Advertisement -
- Advertisement -

Monkeypox in young African girl in Delhi

రాజధానిలో నమోదైన ఐదవ కేసు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఐదవ మంకీపాక్స్ కేసు నమోదైంది. 22 ఏళ్ల ఆఫ్రికన్ యువతికి మంకీపాక్స్ సోకినట్లు నిర్ధారణ అయిందని అధికార వర్గాలు శనివారం తెలిపాయి. నెలరోజుల క్రితం ఆ యువతి నైజీరియాకు వెళ్లి వచ్చినట్లు వారు తెలిపారు. రెండు రోజుల క్రితం ఇక్కడి ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రిలో చేరిన ఆ యువతికి సంబంధించిన వైద్య పరీక్షల నివేదికలు శుక్రవారం వచ్చాయని, ఆమెకు మంకీపాక్స్ పాజిటివ్‌గా తేలిందని వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో మంకీపాక్స్ వైరస్ సోకిన ఐదుగురిలో ఈ ఆఫ్రికన్ యువతి రెండవ మహిళ. ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రిలో మంకీపాక్స్ సోకిన ఐదుగురికి చికిత్స అందచేస్తుండగా వీరిలో ఒకరు డిశ్చార్జ్ అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News