Monday, December 23, 2024

కామారెడ్డి యువకుడికి మంకీపాక్స్ నెగెటివ్

- Advertisement -
- Advertisement -

Monkeypox negative for Kamareddy youth

మనతెలంగాణ/హైదరాబాద్ : కువైట్ నుంచి కామారెడ్డికి వచ్చిన యువకుడికి మంకీపాక్స్ నెగెటివ్‌గా తేలింది. పుణెలోని ఎన్‌ఐవీ ల్యాబ్‌లో బాధిత యువకుడి నమూనాలను పరీక్షించగా నెగెటివ్ అని నిర్ధారణ అయింది. మంకీపాక్స్ లక్షణాలలో ఇటీవల ఫీవర్ ఆస్పత్రిలో చేరిన బాధితుడి నుంచి ఐదు రకాల నమూనాలను సేకరించి.. పుణె ల్యాబ్కు పంపినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నెల 6వ తేదీన కువైట్ నుంచి వచ్చిన ఆ యువకుడు తీవ్ర నీరసానికి గురయ్యాడు. జ్వరంతో బాధపడ్డాడు. దీంతో కామారెడ్డిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు వెళ్లారు. శరీరంపై ఉన్న దద్దుర్లు మంకీపాక్స్ మాదిరిగా ఉండటంతో నోడల్ కేంద్రంగా ఉన్న ఫీవర్ హాస్పిటల్‌కు తరలించారు. బాధితుడితో కాంటాక్ట్ అయిన ఆరుగురిని గుర్తించి కామారెడ్డిలోనే ఐసోలేషన్‌లో ఉంచి పర్యవేక్షించారు. మొత్తంగా బాధిత యువకుడికి మంకీపాక్స్ నెగెటివ్ అని నిర్ధారణ కావడంతో అటు వైద్యులు, ఇటు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News