మంకీపాక్స్ అనేది జంతువుల నుండి మానవులకు సంక్రమించే వైరస్, మశూచిని పోలి ఉంటుంది, అయితే వైద్యపరంగా తక్కువ తీవ్రత ఉంటుంది.
కిన్షాసా(కాంగో): ఫ్రాన్స్, జర్మనీ మరియు బెల్జియంలు శుక్రవారం నాడు మంకీపాక్స్ వైరస్ కేసులను మొదటిసారి ధృవీకరించాయి. యూరోపియన్ దేశాలైన స్పెయిన్, ఇటలీ, పోర్చుగల్ , స్వీడన్ ,కెనడా, ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్‌లలో ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలకు సంబంధించిన ఈ వ్యాధిని ప్రబలినట్లు నివేదించాయి. ఓ 29 ఏళ్ల వ్యక్తి పాజిటివ్‌గా నిర్దారించినట్లు ఫ్రెంచ్ అధికారులు తెలిపారు. బెల్జియన్ నిపుణులు రెండు కేసులు…రెండు వేర్వేరు నగరాల్లో కనుగొనబడినట్లు చెప్పారు. స్పెయిన్ శుక్రవారం 14 కొత్త కేసులను నివేదించింది. దాంతో దాని క్యుములేటివ్ కేస్ లోడ్ 21కి చేరుకుంది.
‘మంకీపాక్స్’ సాధారణంగా జ్వరం, తలనొప్పి, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలతో కూడిన తేలికపాటి వైరల్ ఇన్ఫెక్షన్. ఇది ఎలుకలు, అడవి జంతువులలో ఉద్భవించి తరువాత ప్రజలకు వ్యాపిస్తుంది. మంకీపాక్స్ లో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి. ఒకటి, కాంగో జాతిది,దీనివల్ల 10 శాతం వరకు మరణాలు కలిగాయి. మరియు పశ్చిమ ఆఫ్రికా జాతి, ఇది 1 శాతం మరణాల రేటును కలిగి ఉంది. మంకీపాక్స్ అనేది మశూచి కుటుంబానికి చెందినదే.
France, Germany Report First Cases Of Monkeypox https://t.co/03I87W40TQ pic.twitter.com/v1EH19oGC0
— NDTV News feed (@ndtvfeed) May 20, 2022