- Advertisement -
కాలిఫోర్నియా: అమెరికాలో మంకీపాక్స్ విజృంభించడంతో ఆ దేశ ప్రభుత్వం పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఈ ప్రకటనతో వ్యాక్సిన్ పంపిణీ, చికిత్స వేగవంతం కానుంది. ఈ వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు పెరిగిపోతుండడం వల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా అత్యవసర హెచ్చరికను జారీ చేసింది. అమెరికా 6600 కేసులతో ప్రపంచంలోనే టాప్‌లో ఉందని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అమెరికాలో పావు వంతు కేసులు న్యూయార్క్ రాష్ట్రంలోనే ఉన్నాయి. గత వారమే అక్కడ అత్యవసర స్థితిని ప్రకటించారు. ప్రస్తుతం కాలిఫోర్నియా, ఇల్లినయీస్‌లో కూడా కేసులు పెరుగుతున్నాయి. అక్కడ కూడా ఎమర్జెన్సీని ప్రకటించారు. మంకీపాక్స్ అనేది సన్నిహితంగా మసిలే వారికి త్వరగా అంటుకుంటుంది.
- Advertisement -