- Advertisement -
లక్నో: ఘజియాబాద్‌లోని ఆరోగ్య శాఖ ఐదేళ్ల చిన్నారి శాంపిల్స్‌ను మంకీపాక్స్ పరీక్షల కోసం పంపింది. ఆరోగ్యశాఖ అధికారుల తెలిపిన ప్రకారం, వ్యాధికి సంబంధించిన నిర్దిష్ట లక్షణాలతో ఒక చిన్నారిని గుర్తించిన ఒక క్లినిక్ వారు ఆరోగ్యశాఖ అధికారులకు తెలిపారు. ముందుస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా నమూనాలను తీయడం జరిగింది.
అధికారుల కథనం ప్రకారం వినికిడి వ్యాధికి సంబంధించిన పరీక్ష కోసం మే 23న ఓ మైనర్‌ని ఈఎన్ టి క్లినిక్‌కి తీసుకొచ్చారు. చిన్నారిని పరీక్షించిన డాక్టర్ మైనర్ బాలుడి చర్మంపై విపరీతమైన దద్దుర్లు, దురద లక్షణాలు ఉన్నాయని గుర్తించి వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న నిఘా అధికారి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ను రంగంలోకి దించారు.
- Advertisement -