Sunday, December 22, 2024

గాలి ద్వారా కూడా మంకీపాక్స్ వ్యాపించగలదు: అమెరికా సిడిసి

- Advertisement -
- Advertisement -

Monkeypox

న్యూయార్క్: ఓ ప్రక్క మంకీపాక్స్ వ్యాధి పెరుగుతున్న తరుణంలో… అది రోగి ముఖానికి ముఖం దగ్గరగా పెట్టినప్పుడు గాలి ద్వారా కూడా ఇతరులకు సంక్రమించగలదని ‘ది యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్’ (సిడిసి)తాజాగా వెల్లడించి బాంబులాంటి వార్తను పేల్చింది. సిడిసి చీఫ్ రోచెల్ వాలెన్సీ శుక్రవారం ఓ బ్రీఫింగ్‌లో రోగలక్షణాలున్న రోగులతో శారీరక సంబంధం, వారి దుస్తులు, పరుపులు తాకడం ద్వారా కూడా మంకీపాక్స్ వ్యాపిస్తుందని తెలిపారని ‘డైలీ మెయిల్’ పేర్కొంది. అయితే ‘సాధారణంగా సంభాషించడం, కిరాణా దుకాణంలో ఇతరులను దాటడం, లేక డోర్ నాబ్లు వంటి వాటిని తాకడం ద్వారా ఈ వ్యాధి వ్యాపించదు’ అని ఆమె పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News