Wednesday, January 22, 2025

పాకిస్థాన్‌కు చేరిన మంకీపాక్స్

- Advertisement -
- Advertisement -

మంకీపాక్స్ (ఎంపాక్స్) వైరస్ ఆఫ్రికా ఎల్లలు దాటి పాకిస్థాన్‌కు చేరింది. దేశంలో మూడు ఎంపాక్స్ కేసులను గుర్తించారు. ఈ వైరస్ గ్రస్త లక్షణాలతో ఉన్న ముగ్గురు రోగులను ఇప్పటివరకూ గుర్తించడం జరిగిందని అధికారులు శుక్రవారం తెలిపారు. ఒక్కరోజు క్రితమే ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్లుహెచ్‌ఒ మంకీపాక్స్‌పై గ్లోబల్ ఎమర్జెన్సీని ప్రకటించింది. పలు దేశాలూ అప్రమత్తం అయ్యాయి. పాకిస్థాన్‌లో ఈ కేసులు వెలుగులోకి రావడంతో ఈ వైరస్ తలెత్తిన తొలి ఆసియా దేశం పాకిస్థాన్ అయింది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఎయిర్‌పోర్టులలో వైద్య పరీక్షల స్క్రీనింగ్ విధానాలను మరింత పెంచాలని పాక్ ప్రభుత్వం శుక్రవారం నిర్ణయించింది.

వేగవంత వ్యాప్తి లక్షణాల ఎంపాక్స్ వైరస్ వాయవ్య పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫక్తూన్‌క్వా ప్రాంతంలో తలెత్తింది. ఈ విషయాన్ని ఈ ప్రాంత ఆరోగ్య విభాగం సంచాలకులు సలీం ఖాన్ తమ ప్రకటనలో నిర్థారించారు. యుఎఇ నుంచి విమానంలో వచ్చిన వారిలో ఇద్దరికి ఈ వైరస్ సోకిన విషయం నిర్థారించుకున్నట్లు ఖాన్ చెప్పారు. కాగా మరో వ్యక్తి రక్తపు శాంపుల్స్‌ను ఇస్లామాబాద్‌లోని జాతీయ ఆరోగ్య సంస్థకు పంపించారు. వైరస్ అనుమానాలను నిర్థారించుకోనున్నారు. ఆరోగ్య విషయాల్లో దేశ ప్రధానికి సలహాదారులు, సమన్వయకర్త అయిన డాక్టర్ ముఖ్తార్ అహ్మద్ భారాత్ ప్రస్తుత స్థితిపై ప్రకటన వెలువరించారు. అన్ని ఆసుపత్రులలో రోగులకు క్షుణ్ణంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News