Wednesday, January 22, 2025

చైనాకు శ్రీలంక కోతుల ఎగుమతి?

- Advertisement -
- Advertisement -

కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక ఇప్పుడు అంతరించిపోతున్న ఓ రకం జాతికి చెందిన కోతులను చైనాకు ఎగుమతి చేయాలనుకుంటోంది. చైనాలకు లక్ష కోతులను తరలించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు శ్రీలంక తాజాగా వెల్లడించింది. టోక్ మకాక్ కోతులను పంపించాలని చైనా చేసిన ప్రతిపాదనను అధ్యయనం చేయాలంటూ శ్రీలంక వ్యవసాయ శాఖ మంత్రి మహింద అమరవీర తమ శాఖ అధికారులను ఆదేశించారు.

చైనాలోని వేయి జంతుప్రదర్శన శాలలకు లక్ష కోతులను పంపాలని చైనా కోరినట్లు మంత్రి మహింద అమరవీర తెలిపారు. చైనా విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్నట్లు కూడా చెప్పారు. ఇందుకు న్యాయపరమైన చిక్కుల గురించి అధ్యయనం చేయాల్సిందిగా కోరామని, అందుకు కేబినెట్ అనుమతితో ఓ కమిటీని నియమించినట్లు వెల్లడించారు.

‘లోక్ మకాక్’ కోతులు అంతరించిపోతున్న జీవజాతుల జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతం శ్రీలంకలో టోక్ మకాక్ జాతి కోతులు 30 లక్షలకుపైగా ఉన్నాయి. ఇవి స్థానిక పంటలను దెబ్బతీస్తున్నాయని అక్కడి అధికారులు తెలిపారు. ఇదిలావుండగా ఈ కోతులను చైనాకు ఉచితంగా ఇస్తారా? లేక కొనుగోలు ఒప్పందం చేసుకుంటారా? అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News