Monday, December 23, 2024

కొండముచ్చులను వండుకుని తిన్నారు..వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నిర్మల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని బైంసా మండలం చింతల్ బోరి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి కొందరు కొండముచ్చులను చంపి కూర వండుకుని తిన్నారు. వివరాలలోకి వెళితే.. స్థానికుల కథనం ప్రకారం.. గంగిరెద్దులు ఆడించే వారు ఆరుగురు మంగళవారం సాయంత్రం నాలుగు కొండముచ్చులను చంపి కూర వండుకుని పార్టీ చేశారు. అది గమనించిన కొందరు యువకులు గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. దీంతో గ్రామస్తులు, యువకులు కలిసి ఆరుగురిని పట్టుకొని బైంసా పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరక ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఆరుగురుని అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News