Thursday, January 23, 2025

పసి బాలుడి ప్రాణం తీసిన కోతి

- Advertisement -
- Advertisement -

Monkeys throw baby from 3-storey house in UP

లక్నో: నాలుగు నెలల పసిబాలడిని కోతి ఎత్తుకెళ్లి మూడంతస్థుల భవనం పైనుంచి కిందపడేయడంతో ఆ బాలుడు మృతి చెందిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బరేలీ జిల్లాలో జరిగింది. స్థానికుల సమాచారం మేరకు… ఢంకా గ్రామంలో నిర్దేశ్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తున్నారు. దంపతులిద్దరూ ఉపాద్యాయులగా సేవలందిస్తున్నారు.  నాలుగు నెలల బాబును బిల్డింగ్ పైకి తీసుకెళ్లి దంపతులు వాకింగ్ చేస్తున్నారు. అదే సమయంలో కోతుల గుంపు వారిపై దాడి చేయడంతో బాబును ఎత్తుకొని కిందకు వెళ్తుండగా బాబు జారీ మెట్లపై పడ్డాడు. వెంటనే కోతి బాబును ఎత్తుకెళ్లింది. మూడంతస్థుల భవనంపైకి ఎక్కిన తరువాత బాబుని కిందపడేయడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. కోతుల గుంపు తన బాబు ప్రాణాలు తీశాయని దంపతులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఢంకా గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News