Wednesday, April 2, 2025

ఫ్యామిలీ ఎంజాయ్ చేసే ఎంటర్‌టైనర్

- Advertisement -
- Advertisement -

టీవీ యాంకర్ టర్న్ హీరో ప్రదీప్ మాచిరాజు నటించిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ వేసవిలో ఒక ప్రత్యేక ఆకర్షణగా ఏప్రిల్ 11న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ యూనిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు నితిన్, భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ ఎంటర్‌టైనర్‌లో దీపికా పిల్లి కథానాయికగా నటిస్తోంది. మేకర్స్ సోమవారం థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌లో హీరో ప్రదీప్ మాచిరాజు మాట్లాడుతూ “సినిమా ఆద్యంతం వినోదంతో ఉంటుంది. చాలా సరదాగా ఉంటుంది. తప్పకుండా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాం”అని అన్నారు. డైరెక్టర్ భరత్ మాట్లాడుతూ ఇది ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా అని తెలిపారు. డైరెక్టర్ నితిన్ మాట్లాడుతూ ఇది బ్యూటిఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ దీపికా పిల్లితో పాటు చిత్ర బృందం పాల్గొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News