Friday, November 15, 2024

రుతుపవనాలు నాలుగు రోజులు ఆలస్యం

- Advertisement -
- Advertisement -

జూన్ 4నాటికి కేరళలో ప్రవేశించే అవకాశం: ఐఎండి

న్యూఢిల్లీ: దేశంలోకి రుతుపవనాల రాక కాస్త ఆలస్యం కానుంది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1వ తేదీ నాటికి కేరళ తీరాన్ని తాకుతాయి. అయితే ఈ ఏడాది నాలుగు రోజులు ఆలస్యంగా జూన్ 4 నాటికి రుతు పవనాలు కేరళ లోకి ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం(ఐఎండి) మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. గత ఏడాది మే 29 నాటికే కేరళ తీరానికి చేరుకున్నాయి.

కాగా 2021లో జూన్ 3న, అంతకు ముందు ఏడాది జూన్ 1న ప్రవేశించాయి. ఎల్‌నినో పరిస్థితులు ఏర్పటినప్పటికీ భారత్‌లో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ విభాగం గత నెల ప్రకటించిన విషయం తెలిసిందే. దేశంలో వ్యవసాయానికి అత్యంత కీలకమైన రుతుపవనాలపైనే 52 శాతం వ్యవసాయం ఆధారపడి ఉంది. ఇది దేశం మొత్తం ఆహారోత్పత్తిలో 40 శాతం వాటాకు సమానం. తద్వారా దేశ ఆహార భద్రత, ఆర్థిక సుస్థిరతకు కీలకమైన సహకారం లభిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News