శేరిలింగంపల్లి: రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మన్‌సూన్ టీమ్స్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. శనివారం చందానగర్ సర్కిల్ 21 కార్యాలయం ప్రాంగణంలో ఉప కమిషనర్ సుధాంష్, డివిజన్ కార్పొరేటర్ మంజుల, హఫీజ్‌పేట్ డివిజన్ కార్పొరేటర్ పూజిత, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్, నార్నె శ్రీనివాస్‌లతో కలిసి మన్‌సూన్ ఎమర్జెన్సీ టీం వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ముందుగానే మన్‌సూన్ ఎమర్జెనీ టీం వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు.
చందానగర్ సర్కిల్ కార్యాలయానికి 6 టాటా ఏసి ఆటోలు, 4 జెసిబి వాహనాలను ప్రారంభించడం జరిగిందన్నారు. వర్షాకాలంలో నిత్యం అందుబాటులో ఉండి పని చేస్తాయన్నారు. వర్షాకాలంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తారన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని లోతట్టు ప్రాంతలు, నీరు నిల్వ ప్రాంతాలను గుర్తించి ప్రజలకు ఇబ్బంది కల్గకుండా సన్నద్ధం కావాలని ప్రత్యేక శ్రద్ధ పెట్టి ముంపునకు గురికాకుండా ముందస్తుగా తగు చర్యలు తీసుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడలన్నారు. నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడలన్నారు.
లోతట్టు ప్రాంతాలపై నిర్లక్షం తగదని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. అదేవిధంగా అధికారులు అందరు సమన్వయం చేసుకుంటే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఏలోటు లేకుండా చూడాలన్నారు. ఏ చిన్న సమస్య కలగకుండా ప్రజలకు నిత్యం ఎల్లవేళలా అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ అధికారులు డిఈ స్రవంతి, శానిటేషన్ సూపర్ వైజర్ శ్రీనివాస్, శర్మ, చారీ, వెంకటేష్, నవీన్, అన్వర్, ప్రేమ్, సత్యనారాయణ, రాజు, కృష్ణ, మాజీ కౌన్సిలర్లు రఘుపతిరెడ్డి, లక్ష్మినారాయణగౌడ్, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్‌రెడ్డి, నాయకులు జనార్దన్‌రెడ్డి, రాంచందర్‌రెడ్డి, వెంకటేష్, గోవర్దన్‌రెడ్డి, అక్బర్‌ఖాన్, సుధాకర్, నరేందర్ బల్లా తదితరులు పాల్గొన్నారు.