Wednesday, January 22, 2025

నైరుతి పవనాలు అక్కడే అగిపోయాయి…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ఇంకా రాలేదు. రాయలసీమ నుంచి రుతుపవనాలు ముందుకు కదలలేదు. ఈ నెల 11న ఎపిలోకి ప్రేవేశించిన నైరుతిపవనాలు అక్కడే స్తంభించిపోయాయని వాతావరణ శాఖ పేర్కొంది. రుతుపవనాలు శ్రీహరికోట, కర్నాటకలోని రత్నగిరి ప్రాంతాల్లో నిలిచిపోయాయి. ఈ పాటికి దేశంలోని సగానికి పైగా ప్రాంతాల్లో నైరుతిపవనాలు విస్తరించాల్సిఉంది.

రుతుపవనాలు కదలకపోవడంతో పలు రాష్ట్రాల్లో వడగాల్పులు వీస్తున్నాయి. ఉష్టోగ్రతలు రాష్ట్రంలో అసాధారణ స్థాయిలో నమోదు అవుతున్నాయి. వర్షాకాలం వచ్చినా తీవ్రమైన ఎండలతో ప్రజలు సతమతమవుతున్నారు. రాష్ట్రంలో ఈ నెల 20 తర్వాత వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News