- Advertisement -
తిరువనంతపురం: నైరుతి రుతుపవనాలు మెల్లగా వచ్చేస్తున్నాయి. మరో ఐదు రోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్నాయని భారత వాతావరణ శాఖ సోమవారం తెలిపింది. నైరుతి రుతుపవనాల రాకతో ఈ నెల ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం లభించనున్నది. అయితే జూన్ లో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది.
కేరళలో నైరుతి రుతుపవనాలు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉండనున్నాయి. నైరుతి రుతుపవనాలు దేశంలో 70 శాతం వానలు కురిపించనున్నాయి. భారత ఎకనామి క్యాలెండర్ లో రుతు పవనాలు చాలా ముఖ్యమైనవి.
- Advertisement -