Friday, December 20, 2024

ధైర్యం ఇచ్చే సినిమా

- Advertisement -
- Advertisement -

నవీన్ చంద్ర, స్వాతి రెడ్డి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మంత్ ఆఫ్ మధు’. శ్రీకాంత్ నాగోతి ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించగా, యశ్వంత్ ములుకుట్ల క్రిషివ్ ప్రొడక్షన్స్, హ్యాండ్‌పిక్డ్ స్టోరీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ‘మం త్ ఆఫ్ మధు’ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే ఒక యూనిక్ రిలేషన్ షిప్ డ్రామా. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ చిత్రం విడుదల తేదీని ప్రకటించారు. మంత్ ఆఫ్ మధు సినిమా అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముం దుకు రానుంది. ఈ కార్యక్రమంలో స్వాతి రెడ్డి మాట్లాడుతూ.. ’‘

మంత్ ఆఫ్ మధు సినిమాలో మాకు తెలిసిన నిజాన్ని నిజాయితీగా చెప్పాం. మనకు చిన్నప్పుటి నుంచి ఏదో చెప్తారు, ఏదో నమ్ముతాము. కానీ రియల్ లైఫ్ డిఫరెంట్‌గా వుం టుంది. ఈ సినిమాలో చూపించిన నిజం ధైర్యం ఇచ్చేలా వుంటుంది. ధైర్యం ఇచ్చే సినిమా ఇది”అని అన్నారు. దర్శకుడు శ్రీకాంత్ నాగోతి మాట్లాడుతూ “మేము ఎంత ప్యాషనేట్‌గా సినిమా తీశా మో.. ప్రేక్షకులకు కూడా అంతే చక్కగా రీచ్ అవుతుందనే నమ్మకం వుంది. అక్టోబర్ 6న సినిమాని ప్రేపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో యశ్వంత్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News