Monday, December 23, 2024

మంత్ ఆఫ్ మధు… స్పెషల్ మూవీ

- Advertisement -
- Advertisement -

నవీన్ చంద్ర, స్వాతిరెడ్డి ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం మంత్ ఆఫ్ మధు. శ్రీకాంత్ నాగోతి ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించగా, యశ్వంత్ ములుకుట్ల క్రిషివ్ ప్రొడక్షన్స్, హ్యాండ్‌పిక్డ్ స్టోరీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపధ్యంలో మేకర్స్ హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఆస్కార్ విజేత ఎం.ఎం కీరవాణి, హీరో సిద్ధు జొన్నలగడ్డ ముఖ్య అతిధులుగా హాజరైన ఈ ప్రీరిలీజ్ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.

ఈ ఈవెంట్‌లో ఎం.ఎం.కీరవాణి మాట్లాడుతూ “మంత్ ఆఫ్ మధు… ట్రైలర్ చూసినప్పుడు ఫీల్ గుడ్ మూవీ అనిపించింది. నటీనటులు, టేకింగ్, నేపధ్య సంగీతం ఇవన్నీ బావున్నాయి. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకుల మనసుని ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను”అని అన్నారు. హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ “మంత్ ఆఫ్ మధు చాలా స్పెషల్ మూవీ. ఇలాంటి పాత్రలు, సినిమాలు అరుదుగా వస్తుంటాయి. శ్రీకాంత్‌తో వర్క్ చేయడం ఇది రెండోసారి. అచ్చు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు”అని పేర్కొన్నారు. దర్శకుడు శ్రీకాంత్ నాగోతి మాట్లాడుతూ “ఈ సినిమాలో నవీన్ ప్రతి షాట్‌లో సర్‌ప్రైజ్ చేస్తారు. మంత్ ఆఫ్ మధు చిత్రాన్ని ప్యాషన్‌తో తీశాము” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత యశ్వంత్, హీరోయిన్ స్వాతి రెడ్డి, శ్రేయా పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News