Sunday, December 22, 2024

నెలవారీ విద్యుత్ వినియోగం 7 మిలియన్ యూనిట్లు తగ్గింపే లక్ష్యం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: హైదరాబాద్ హాస్టల్స్‌లో నెలవారీ విద్యుత్ వినియోగాన్ని 7 మిలియన్ యూనిట్ల మేర తగ్గించే లక్ష్యంతో ఒక అధునాతన ప్రీపెయిడ్ మీటరింగ్ సిస్టమ్ ‘బిజ్లీ బడ్డీ’ కోసం రేడియస్‌తో పిజిఒ అండ్ ఐటిసిహెచ్‌ఎ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఐటి కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ (ఐటిసిహెచ్‌ఎ) సహకారంతో ఇన్నోవేటివ్ హాస్టల్, పేయింగ్ గెస్ట్, కో-లివింగ్ బుకింగ్ సర్వీస్ అందించే సంస్థ థింక్‌వైడ్ పిజిఒ, నోయిడా- ఆధారిత రేడియస్ సినర్జీస్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లి మిటెడ్ (ఆర్‌ఎస్‌ఐపిఎల్) మధ్య ఈ డీల్ జరిగింది. ఈ సందర్భంగా అత్యాధునిక మీటరింగ్ సొల్యూషన్ ‘బిజ్లీ బడ్డీ‘ని ప్రారంభించినట్లు వెల్లడించింది.

పిజిఒ వ్యవస్థాపకుడు, సిఇఒ హరి కృష్ణ మాట్లాడుతూ, మెరుగ్గా విద్యుత్ వినియోగించటం, అతి తక్కువ విద్యుత్ బిల్లుల ఆవశ్యకత పెరుగుతుండటంతో ప్రీపెయిడ్ ఎలక్ట్రిసిటీ మీటర్లు ప్రజాదరణ పొందాయని అన్నారు. విద్యుత్తు కోసం ముందస్తుగా చెల్లించడానికి వినియోగదారులను అనుమతించడం ద్వారా విద్యు త్ వినియోగాన్ని తగ్గిస్తుంది. దేశంలో మొట్టమొదటి సారిగా హాస్టల్ పిజి(పేయింగ్ గెస్ట్) మార్కెట్‌ప్లేస్‌లో భారీ స్థాయిలో 2 లక్షల మీటర్ల ఏర్పాటుతో అధునాతన మీటరింగ్ సిస్టమ్‌ను అందిస్తుంది. ఐటిసిహెచ్‌ఎ జనరల్ సెక్రటరీ తాతా క రుణాకర్ అధునాతన ప్రీపెయిడ్ ఎలక్ట్రిక్ మీటరింగ్ సొల్యూషన్ హాస్టల్ పిజి సౌకర్యాలకు తీసుకువచ్చే ప్రయోజనాలను గుర్తించారు. ఈ పరిష్కారాల వల్ల 10 నుండి 15 శాతం గణనీయమై న విద్యుత్ ఆదా అవుతుందని అంచనా వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News