మన తెలంగాణ/అమరావతి : రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు గురువారం రాజీనామా చేశా రు. ఢిల్లీలో రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ కు రాజీనామా పత్రాలు సమర్పించారు. వైసీపీకి కూ డా రాజీనామా చేస్తున్నట్లు వారు తెలిపారు. ఇద్ద రూ టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. మరో ఆ రుగురు వైసీపీ ఎంపీలు కూడా తమ పదవులతో పాటు, ఆ పార్టీకి రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈ ఎనిమిది మందిలో న లుగురు టీడీపీ వైపు, మరో నలుగురు బీజేపీ వైపు చూస్తున్నారని చెబుతున్నారు. తొలినుంచి రాజకీయాల్లో ఉన్నవారు టీడీపీ, వ్యాపార వర్గాలనుంచి వచ్చినవారు బీపేజీ వైపు వెళ్లవచ్చని అంటున్నారు. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో పూర్తి స్పష్టత వచ్చే అవకాశముంది.
త్వరలో టీడీపీలో చేరబోతున్న ట్లు తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మా ట్లాడుతూ ‘అధికారం నాకు కొత్తేమీ కాదు.. గతం లో ఎన్నో పదవుల్లో పనిచేశాను. గత ఏడాది లంగా నియోజవర్గంలో జరుగుతున్న పరిణామాలతో ఇబ్బంది పడ్డా. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులతో రాజీనామా చేస్తున్నా. ఎన్నికల్లో వైసీపీకి వ్య తిరేకంగా ప్రజలు ఘోరమైన తీర్పు ఇచ్చారు. ఇ ప్పటికే చాలామంది నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మరికొంత మంది రాజీనామా చేశారు. లోపం ఎక్కడ ఉందనే దానిపై వైసీ పీ అధిష్ఠానం విశ్లేషించుకోవాలని, అనుభవం ఉ న్న నేత సీఎం చంద్రబాబు. రాష్ట్రాన్ని ఆయన గాడి లో పెడుతున్నారు. చంద్రబాబు సారథ్యంలో పనిచేయాలని భావిస్తున్నానన్నారు. త్వరలో టీడీపీలో చేరనున్నామని, పార్టీలో సముచిత స్థానం కల్పిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.