Monday, December 23, 2024

భార్యను కౌగలించుకుని… వెనక నుంచి గన్ తో కాల్చాడు… దంపతుల మృతి

- Advertisement -
- Advertisement -

లక్నో: ఫోన్ దంపతుల ప్రాణం తీసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మొరాదాబాద్‌లోని బిలారీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఖాన్‌పూర్ గ్రామంలో పాల్-సుమన్ అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు. సుమన్ ఫోన్ పొగొట్టుకోవడంతో గత కొన్ని రోజుల నుంచి ఇద్దరు మధ్య గొడవలు జరుగుతున్నాయి.

Also Read: ఎపి నుంచి ఒక ఐపిఎల్ టీం…

మంగళవారం ఇంట్లో పూజలు చేసిన తరువాత ఇద్దరు మధ్య ఫోన్ గురించి చర్చ జరిగింది. చర్చ తారాస్థాయికి చేరుకోవడంతో కోపంలో భార్యను భర్త కౌగిలించుకొని నాటు తుపాకీతో వెనక నుంచి వీపు భాగంలో కాల్చాడు. తుపాకీ గుండు ఆమె శరీరంలో నుంచి భర్త శరీరంలోకి దూసుకెళ్లడంతో ఇద్దరు కిందపడిపోయారు. బుల్లెట్ శబ్ధ విని స్థానికులు ఇంటికి చేరుకొని వారిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఇద్దరు చనిపోయారని పరీక్షించిన వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నలుగురు పిల్లలను సంరక్షణాలయానికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News