Sunday, November 3, 2024

శబ్ద కాలుష్యంలో మొరాదాబాద్‌కు రెండోస్థానం

- Advertisement -
- Advertisement -

Moradabad ranks second in noise pollution

బంగ్లాదేశ్ లోని ఢాకా మొదటి స్థానం
పాక్ లోని ఇస్లామాబాద్ మూడో స్థానం

మొరాదాబాద్ : ప్రపంచం లోనే అత్యధికంగా శబ్ద కాలుష్యం ఉన్న నగరాలను యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్ తాజాగా వెల్లడించింది. దక్షిణాసియాలోని మూడు సగరాలు శబ్ద కాలుష్య జాబితాలో మొదటి మూడు స్థానాల్లో నిలిచాయని ఐక్యరాజ్యసమితి తెలిపింది. బంగ్లాదేశ్ లోని ఢాకా శబ్ద కాలుష్యంలో మొదటి స్థానంలో ఉండగా, భారత్ లోని ఉత్తరప్రదేశ్‌లో గల మొరాదాబాద్ రెండో స్థానంలో, పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్ నగరం మూడో స్థానంలో నిలిచాయి. ప్రపంచ వ్యాప్తంగా ధ్వని కాలుష్యం వల్ల మిలియన్ల మంది వినికిడి లోపానికి గురయ్యే ప్రమాదం ఉందని సమితి తెలియచేసింది. అయితే అంతర్జాతీయ పర్యావరణ సంస్థ అధ్యయనం సరైనది కాదని, ఆ నివేదిక తప్పని మొరాదాబాద్ కాలుష్య నియంత్రణ బోర్డు అధికారి వికాస్ మిశ్రా చెప్పారు.

శబ్దకాలుష్యం డేటాను కొలవడానికి యునైటెట్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్ ఎలాంటి సెన్సార్లు ఏర్పాటు చేయలేదని , దీనిపై తమకు కనీస సమాచారం కూడా లేదని మిశ్రా చెప్పారు. నగరాల్లో శబ్దకాలుష్యం వల్ల దీర్ఘకాలిక శారీరక, మానసిక ఆరోగ్యం ప్రభావితమవుతుందని నివేదిక పేర్కొంది. మొరాదాబాద్ నగరంలో 114 డెసిబుల్ శబ్ద కాలుష్యం ఉందని యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్ పేర్కొంది. కోల్‌కతా, అసన్సోల్ , జైపూర్ నగరాల్లో శబ్దకాలుష్యం 90 డెసిబుల్స్ స్థాయిలో ఉందని నివేదిక వెల్లడించింది. టొరంటో నగరంలో రోడ్డు ట్రాఫిక్ శబ్దకాలుష్యం వల్ల మయోకార్డియల్ సమస్యతో రక్తప్రసరణ తగ్గి గుండె ఆగిపోయే ప్రమాదాలు పెరిగాయని , రక్తపోటు పెరుగుతుందని నివేదిక వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News