Monday, March 10, 2025

తండ్రిని కూతుళ్లు కర్రలతో చావకొట్టి… ఆత్మహత్య?

- Advertisement -
- Advertisement -

భోపాల్: ఇద్దరు కూతుళ్లకు పెళ్లి చేసిన వారం రోజులకే భర్త కాళ్లు భార్య గట్టిగా పట్టుకోగా ఇద్దరు కూతుళ్లు తండ్రిని కర్రలతో తీవ్రంగా చావకొట్టారు. అనంతరం తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం మొరానా సిటీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. కొత్వాలి ప్రాంతంలో హరేంద్ర మౌర్య తన భార్య, ముగ్గురు కూతుళ్లు, కుమారుడితో కలిసి ఉంటున్నాడు. దంపతులు మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగతున్నాయి. మార్చి 1న తన ఇద్దరు కూమార్తెలకు ఘనంగా వివాహం చేశాడు. మార్చి 8న ఇద్దరు కూతుళ్లను అత్తారింటికి పంపించాడు. ఆ సాయంత్రమే హరేంద్రతో భార్య గొడవ పెట్టుకొని తన పుట్టింటికి వెళ్లిపోతానని తెగేసి చెప్పింది. బాధతో హరేంద్ర తన రూమ్ లోకి వెళ్లి బయటకు రాలేదు.

అనుమానంతో కుటుంబ సభ్యులు బలవంతంగా డోర్ ఓపెన్ చేసి చూడగా ఉరేసుకొని కనిపించాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. హరేంద్రకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హరేంద్ర కాళ్లు భార్య పట్టుకొని ఉండగా ఇద్దరు కూతుళ్లు అతడిని కర్రలతో చితకబాదారు. దీనికి వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. హరేంద్ర బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసి అనంతరం ఆత్మహత్య చిత్రీకరించారని అతడి బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులు శవాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News