Friday, December 20, 2024

మోరంచపల్లి గ్రామస్తులు సురక్షితం

- Advertisement -
- Advertisement -

మోరంచపల్లి: రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లిలో వరద నీటిలో చిక్కుకున్న గ్రామస్తులను సహాయక బృందాలు రక్షించాయి. ముంపు ప్రాంతం నుంచి ప్రజలను హెలికాప్టర్లు, బోట్ల ద్వారా గ్రామస్తులను రక్షించిన అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గ్రామస్తులను బోట్లలో పునరావాస కేంద్రాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తరలించాయి. సహాయక చర్యల్లో 2 హెలికాప్టర్లు పాల్గొన్నాయి. గ్రామస్తులను 6 ఫైర్‌ డిపార్ట్‌మెంట్ బోట్లు తరలించాయి. గ్రామం మొత్తాన్ని ఖాళీ చేయించామని అధికారులు వెల్లడించారు. వరదలో చిక్కుకున్న ఆరుగురిని హెలికాప్టర్ ద్వారా అధికారులు కాపాడారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News