Monday, December 23, 2024

ఇష్టారాజ్యంగా వాహనాల పార్కింగ్

- Advertisement -
- Advertisement -

More accident with wrong parkingప్రాణాలు కోల్పోతున్న వాహనదారులు

 

మన తెలంగాణ/ డిచ్‌పల్లి: మండల కేంద్రంలోని రై ల్వే స్టేషన్ నుంచి మొదలుకొని బెంగలూరు బేకరీ వ రకు కొన్ని వ్యాపార సముదాయాలు ఏర్పాటుచేసుకు ని అక్రమంగా రోడ్లపై నిర్మాణాలు చేస్తూ ప్రజల వా హనాల రాకపోకలకు ఇబ్బందులకు గురిచేస్తున్నార ని, తరచూ ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత పంచాయతీ అధికారులు పట్టించుకోవడంలేదని ప లువురు ఆరోపిస్తున్నారు. రైల్వే స్టేషన్ ఎదుట రహదారికి ఇరువైపులా వ్యాపార సముదాయాల ముం దు ఫాస్ట్‌ఫుడ్, కిరాణా, హార్డవేర్ షాపుల నిర్వాహకు లు తమ షాపుల ముందు రోడ్లపైకి నిర్మాణాలు చేసి టీన్ షెడ్లు ఏర్పాటు చేసుకోవడంతో రోడ్డుపై రాకపోకలకు ప్రజలకు ఇబ్బందిగా మారింది. రోడ్డుపైనే వ్యాపారాలవల్ల ప్రజలకు వాహనదారులకు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని మండలప్రజలు తెలిపారు. వ్యాపార దుకాణాలు రోడ్డుకు సెట్‌బ్యాక్ వది లి నిర్మాణాలు చేయవలసి ఉండగా రోడ్లను అక్రమించి వ్యాపారులు నిర్మాణాలు చేస్తున్నా పంచాయ తీ సిబ్బంది పట్టించుకోకపోవడంలో ఆంతర్యమేమిట ని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిర్మాణ దశలోనే ముందుగా సెట్‌బ్యాక్ వదిలి నిర్మాణం చేయవలసిం ది పోయి సంబందిత అధికారులకు ముడుపులు ము ట్టచెప్పి ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేస్తున్నారే విమర్శలు వస్తున్నాయి. రోడ్లపై అక్రమంగా వ్యాపారులు నిర్మాణాలు చేస్తూ, రోడ్లను ఆక్రమిస్తూ తరచూ ప్ర మాదాలకు కారణమవుతున్నా సంబంధిత అధికారు లు పట్టించుకోకపోవడం అధికారులకు పరిపాటిగా మారిందని స్థానికులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా గ్రామ పంచాయతీ అధికారులు ఎంపిఓ, ఇఓలు చూసీచూడనట్లుగా వ్యవహరించ డం కొనమెరుపు. ఇప్పటికైనా మండల పరిషత్ అధికారి స్పందించి రైల్వేస్టేషన్ నుంచి మొదలుకుని బెం గుళూరు బేకరీవరకు రోడ్డుపై అక్రమంగా వెలిసిన దుకాణాలను రేకుల షెడ్లను తొలగించి రాకపోకలకు అసౌకర్యం కలగకుండా చూడాలని కోరుతున్నారు. రోడ్లపై ఇష్టారాజ్యంగా వాహనాలు పార్కింగ్‌చేసే వా హనదారులపై ట్రాఫిక్ సిబ్బంది దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. డిచ్‌పల్లి రైల్వే గేట్ వైపువెళ్లే గ్రోమర్ యూటర్న్ రోడ్డుపైన ఎలాంటి ప్రమాద సూచికలు పెట్టకపోవడంతో రెండు వైపుల నుంచి వ స్తున్న వాహనదారులు రోడ్డుపై తికమక పడాల్సివస్తోందని, ఈప్రాంతంలో తరచూ ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారని, దీనిపై స్పందించి సంబంధిత అధికారులు రోడ్డుపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News