Tuesday, January 21, 2025

తెలంగాణకు వచ్చిన అవార్డులు ఏ రాష్ట్రానికి రాలేదు: ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

More Award to Telangana in India

 

హైదరాబాద్: తెలంగాణకు వచ్చినన్ని అవార్డులు ఏ రాష్ట్రానికి రాలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఒకే సారి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు, మిషన్ భగీరథకు కూడా అవార్డులు పెద్ద సంఖ్యలో వచ్చాయని, ఇంటింటికి నీళ్లు అనేది సిఎం కెసిఆర్ ఆనాడు సిద్ధిపేటకు ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. అదే స్ఫూర్తిగా, మోడల్ గా తీసుకుని తెలంగాణ వచ్చాక కృష్ణా, గోదావరి నీటిని ఇంటింటికి ఇవ్వడం జరిగిందన్నారు.

బోరు వాటర్ తో రోగాలు వస్తాయని గమనించిన కెసిఆర్ ఇంటింటికి మిషన్ భగీరథ పేరుతో తాగు నీటిని ఇ్వవడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఫ్లోరైడ్ లేదని కేంద్ర మంత్రి పార్లమెంట్ లో ప్రకటించారని, ఇది కెసిఆర్ ఘనత అని ప్రశంసించారు. వివిధ రాజకీయ పార్టీలు గతంలో ఫ్లోరైడ్ తో కూడా రాజకీయాలు చేసాయని, అధికార పార్టీలో ఉన్నా,  ప్రతిపక్షంలో ఉన్న కూడా నాయకులు రాజకీయం చేశారని మండిపడ్డారు. గతంలో కాలిపోయిన మోటర్లు, నీటి సమస్యలతో ఇబ్బందులు ఉండేవని, ఈనాడు అసెంబ్లీ స్టార్ట్ అయితే కరెంటు కోసం, నీటి కోసం మాట్లాడే పరిస్థితి లేదన్నారు. గతంలో ఎలా ఉందో.. ఇప్పుడు ఎలా ఉందో.. రాజకీయ పార్టీలు ఆత్మ విమర్శ చేసుకోవాలని ఎర్రబెల్లి సూచించారు.

54 లక్షల ఇళ్లకు నీళ్లు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ అని ప్రశంసించారు. ప్రతీ గ్రామంలో ఇంటికి 100 లీటర్లు, మున్సిపాలిటీ 135 లీటర్లు, కార్పోరేషన్ పరిధిలో 150 లీటర్లు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, తక్కువ సమయంలో అంటే రెండు ఏళ్లలో 59.94 టిఎంసిల నీటిని ఇంటింటికి ఇచ్చిన ఘనత తెలంగాణకు దక్కుతుందన్నారు. మా అధికారులు సమన్వయంతో ఇది సాధ్యమైందని కొనియాడారు. 46 వేల 123 కోట్లతో ఈ స్కీమ్ మొదలు పెట్టామని, రేట్లు పెరుగుతున్నా ఖర్చు తగ్గించామన్నారు. మా అధికారుల పని తీరు వల్ల సాధ్యమైందని ఎర్రబెల్లి కొనియాడారు.

swachh survekshan 2022 awards

నాణ్యత విషయంలో రాజీపడే సమస్యే లేదని, జీరో మెయింటెనెన్స్ సాధించామని, స్వచ్ఛ భారత్ కింద తెలంగాణ రాష్ట్రానికి ఏడు అవార్డులు వచ్చాయని కొనియాడారు.నిజామాబాద్ కు రెండు అవార్డులు వచ్చాయని, మొత్తం జాతీయ స్థాయిలో 13 అవార్డులు వచ్చాయని ప్రశంసించారు. మిషన్ భగీరథతో 14 అవార్డులు వచ్చాయని,  తెలంగాణలో జరిగే అభివృద్ధి ప్రతీ మీటింగ్ లో కేంద్ర స్థాయిలో ప్రసంశలు వస్తున్నాయని, అవార్డులు ఇవ్వడమే కాకుండా రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని కోరుతున్నామని, నిధులు ఇచ్చే విషయంలో చాలా సార్లు తెలంగాణను కేంద్రం మోసం చేసిందని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News