Friday, November 22, 2024

పట్నానికి పట్టం

- Advertisement -
- Advertisement -

ఉచిత తాగునీటి పథకం కోసం
250 కోట్లు కేటాయింపు
భవిష్యత్తులో నీటి కోసం
సుంకిశాల ప్రాజెక్టు నిర్మాణానికి
725 కోట్లు
ఓఆర్‌ఆర్ పరిధిలోని
కాలనీల నీటి సరఫరాకు
250 కోట్లు
మూసీ సుందరీకరణకు
కోట్లు, మెట్రోకు
కోట్ల ప్రతిపాదనలు

బడ్జెట్ కేటాయింపుల్లో హైదరాబాద్‌పై వరాల జల్లు

మన తెలంగాణ/సిటీబ్యూరో: గ్రేటర్ నగరం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత సిఎం కెసిఆర్ నగరాభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు రచించి ప్రత్యేక దృష్టి పెట్టి అమలు చేస్తున్నారు. సామాజిక, ఆర్దిక, స్దిరాస్ది వ్యాపార, ఉపాధిదాయక అంశాల ప్రాతిపదికన ప్రతి సంవత్సరం జరిగే ప్రపంచ స్దాయి అధ్యయానాల్లో మహానగరం రెండవ అగ్రగామిగా నిలిచింది. నగరంలో 09 ప్లై ఓవర్లు, 4 అండర్‌పాస్‌లు, 3 ఆర్వోబిల నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. కరోనా సమయంలో 2వేల కోట్ల రూపాయల విలువైన ప్లైఓవర్లు, 300కిమీ రోడ్లు, 29లింక్‌రోడ్ల నిర్మాణం చేపట్టి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చేశారు. బంజారాహిల్స్ నుంచి హైటెక్ సిటీ మధ్య దూరం ఉండటంతో వాహనదారులకు త్వరగా వెళ్లేందుకు దుర్గం చెరువు కేబుల్ బిడ్జ్రి ఏర్పాటు చేసి వేగంగా ప్రయాణించే వెసులు బాటు కల్పించారు. అదే విధంగా బిడ్జ్రికి కొత్త అందాలు తెచ్చి రోజు వేలాదిమంది పర్యాటకులు తిలకించేలా చేశారు. పేదల ఆకలి తీర్చేందుకు 179 అన్నపూర్ణ సెంటర్ల ద్వారా రోజు 55వేలు మందికి ఐదు రూపాయలకే రుచికరమైన భోజనం అందిస్తున్నారు.

ఇటీవల జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా నగరవాసులకు మంచినీటిపై ఇచ్చిన హామీని ప్రభుత్వ నెలబెట్టుకుని ప్రతి కుటుంబానికి 20వేల లీటర్ల సురక్షిత తాగునీరు ఉచితంగా సరఫరా చేస్తోంది. ఉచిత మంచినీటి సరఫరా కోసం బడ్జెట్‌లో రూ. 250 కోట్లు కేటాయించింది. అదే విధంగా నగర ప్రజల భవిష్యత్తు తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని నాగార్జునసాగర్ సమీపంలోని సుంకిశాల నుంచి నీటిని తరలించడానికి కొత్త ప్రాజెక్టు నిర్మించేందుకు రూ. 1450 కోట్ల నిధులు అంచనా వేస్తూ ఈబడ్జెట్‌లో సుంకిశాల వద్ద నిర్మించే ప్రాజెక్టు కోసం రూ. 725 కోట్ల నిధులు కేటాయించింది. ఔటర్ రింగ్‌రోడ్డు పరిధిలోని కొత్తగా ఏర్పడిన కాలనీలకు తాగునీటి సరఫరా కోసం రూ. 250 కోట్లు ప్రతిపాదన చేశారు.

మూసీనది పునరజ్జీవనం కోసం, మూసీ పరిసరాల సుందరీకరణ కోసం రూ. 200 కోట్లు బడ్జెట్‌లో పేర్కొన్నారు. నగరంలో రోజుకు లక్షలామందిని వివదిధ ప్రాంతాలకు చేరువేస్తున్న మెట్రో రైలు ప్రాజెక్టు కోసం ఆర్దిక మంత్రి హరీష్‌రావు రూ. 1000 కోట్లు త్వరలో కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కరోనా సమయంలో రోగుల సంఖ్య పెరుగుతుండటంతో గచ్చిబౌలిలో తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)ను ఏర్పాటుచేసింది. దానికి కావాల్సిన పడకలు, అక్సిజన్ సదుపాయాలను త్వరగా సమకూర్చునున్నట్లు చెప్పారు. ఐటీ కంపెనీలకు హబ్‌గా మారిన గ్రేటర్ నగరం దేశానికి ఓరోల్ మోడల్‌గా మారింది. మహిళా పారిశ్రామికవేత్తల కోసం వి-హబ్ ఏర్పాటు చేసింది. హైదరాబాద్ అర్బన్ ప్రాంతాలైన కొంపల్లి, కొల్లాపూర్, శంషాబాద్, ఉప్పల్, పోచారంలో ఐటీ పార్కుల విస్తరణకు ప్రభుత్వ ప్రణాళికలు సిద్దం చేసున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.జంటనగరాల్లో ఉన్న దేవాలయాల్లో కూడా ఈఆర్దిక సంవత్సరం నుంచి ధూపదీపనైవేద్య పథకం విస్తరింపజేయనున్నట్లు, దేవాలయాల అభివృద్ది, అర్చకులు, దేవాదాయ ఉద్యోగుల సంక్షేమం కోసం రూ. 720 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఫార్మారంగంలో జరిగే జాతీయ ఎగుమతులలో 14శాతం ఇక్కడి నుంచి ఉన్నాయి. వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసే ఫార్మా కంపెనీల్లో 3వ వంతు కంపెనీలు హైదరాబాద్‌లో నెలకొని ఉన్నాయి.

పరిశ్రమల రాయితీల కోసం ఈఆర్దిక సంవత్సరంలో రూ.2500 కోట్లు కేటాయిస్తున్నట్లు విత్తమంత్రి పేర్కొన్నారు. నగరంలో విద్యారంగాన్ని సంపూర్ణంగా, సమగ్రంగా ఉన్నతీకరిస్తూ రూ. 950 కోట్లు కేయిస్తూ రాబోయే రెండేళ్ల అన్ని ప్రభుత్వ పాఠశాల్లో మౌలిక వసతుల నిర్మాణం పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు వెల్లడించారు. కావాల్సిన ఫర్నీచర్, టాయిలెట్లు వంటి వసతులు కల్పించాలని నిర్ణయించినట్లు, ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో పాఠశాల తరగతులను అనుసంధానం చేస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో పేర్కొనడంతో నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ టిఆర్‌ఎస్ ప్రభుత్వంతో బంగారు తెలంగాణ సాధ్యమైతుందని ప్రశంసిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News