Thursday, January 23, 2025

 ఉన్నత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తాం: సబితా

- Advertisement -
- Advertisement -

More changes in higher education system

హైదరాబాద్: పూర్వజన్మలో పుణ్యం చేసుకుంటేనే ఉపాధ్యాయులుగా ఉంటామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రవీంద్ర భారతిలో విద్యాశాఖ అధ్వర్యంలో జరిగిన గురుపూజోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కరోనా సమయంలో టీచర్లు చేసిన కృషి సమాజం ఎప్పటికీ మర్చిపోదని, విద్యావ్యవస్థలో దేశమంతా తెలంగాణ వైపు తిరిగి చూస్తోందని తెలిపారు. తెలంగాణలో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రయివేట్ స్కూల్స్ లో అడ్మిషన్స్ క్యాన్సిల్ చేసుకొని ప్రభుత్వ స్కూళ్లకి పంపుతున్నారని ప్రశంసించారు. విద్యావిధానంలో నైతిక విలువలకు పెద్దపీట వేయాలని సిఎం కెసిఆర్ చెబుతూ ఉంటారన్నారు.  ఉన్నత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తామని, మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులు పెట్టాలని కెసిఆర్ సూచించారని, దేశంలో ఎక్కడ లేని విధంగా గురుకులాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్నామని చెప్పారు. మన ఊరు మన బడి కార్యక్రమానికి అందరి భాగస్వామ్యం కావాలని సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రం విద్యం కోసం ఎంతో ఖర్చు చేస్తున్నా కూడా కేంద్రం నుండి అభినందన, సహకారం ఉండడం లేదని మండిపడ్డారు. చట్ట పరంగా మనకు రావాల్సిన నిధులు కూడా కేంద్రం ఇవ్వడం ఇవ్వకుండా మోకలడ్డు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని నడిపించే నాయకులు రాష్ట్రాల గూర్చి ఆలోచించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News