Wednesday, March 26, 2025

‘మ్యాడ్ స్క్వేర్’లో ‘మ్యాడ్’ని మించిన కామెడీ ఉంటుంది

- Advertisement -
- Advertisement -

బ్లాక్‌బస్టర్ చిత్రం ‘మ్యాడ్’కి సీక్వెల్‌గా రూపొందుతోన్న ’మ్యాడ్ స్క్వేర్’ కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. మార్చి 28న విడుదల కానున్న ‘మ్యాడ్ స్క్వేర్’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీడియాతో ముచ్చటించిన మ్యాడ్ గ్యాంగ్ నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా నార్నె నితిన్ మాట్లాడుతూ “మ్యాడ్‌లో ప్రతి పాత్రకు ఒక ట్రాక్ ఉంటుంది. నా పాత్ర మొదట కాస్త సీరియస్ గా ఉంటుంది. చివరికి వచ్చేసరికి మిగతా పాత్రల్లాగా కామెడీ చేస్తుంటాను. ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్‌లో పూర్తి కామెడీ పాత్రలో కనిపిస్తాను. అందుకు తగ్గట్టు నన్ను నేను మలుచుకున్నాను. ఇది నవ్వించడమే లక్ష్యంగా తీసిన సినిమా. నా మొదటి సినిమా నుంచి జూనియర్ ఎన్టీఆర్ నాకు సలహాలు ఇస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగానే నన్ను నేను మలుచుకుంటున్నాను. భవిష్యత్ లో కూడా ఆయన సలహాలు తీసుకుంటాను”అని పేర్కొన్నారు. రామ్ నితిన్ మాట్లాడుతూ “మ్యాడ్ అనేది మాకు ఎంతో స్పెషల్ మూవీ. మ్యాడ్‌తో పోలిస్తే మ్యాడ్ స్క్వేర్‌లో కామెడీ ఎక్కువ ఉంటుంది. ఈసారి అశోక్(నార్నె నితిన్), మనోజ్(రామ్ నితిన్) పాత్రలు కూడా ఎక్కువ వినోదాన్ని పంచుతాయి. ప్రేక్షకులు ఈ కామెడీని బాగా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాము”అని అన్నారు. సంగీత్ శోభన్ మాట్లాడుతూ “వినోదమే ఈ సినిమాకి మెయిన్ హీరో. ఆ వినోదమే మ్యాడ్ స్క్వేర్ ని నడిపిస్తుంది. మ్యాడ్ విజయం ఇచ్చిన నమ్మకంతో మ్యాడ్ స్క్వేర్ ను ఆడుతూపాడుతూ చేశాము. ఇంకా ఎక్కువ నవ్వించాలనే ఆలోచన తప్ప, ప్రత్యేక కసరత్తులు చేయలేదు”అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News