Thursday, January 23, 2025

శ్రీలంకలో కరోనా కంటే ఈ సంక్షోభంలోనే అధిక మరణాలు

- Advertisement -
- Advertisement -

అధ్యక్షుడికి జాతీయ మెడికల్ అసోసియేషన్ లేఖ

కొలంబో : శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం రోజురోజుకూ తీవ్రమౌతోంది. నిత్యావసరాలు, ఇంధనధరలు, ఔషధాల కొరత తీవ్రంగా వేధిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఔషధాల కొరత ఇలాగే కొనసాగితే కరోనా కారణంగా ఈ రెండేళ్ల కాలంలో సంభవించిన మరణాల కంటే ఈ సంక్షోభ మరణాల సంఖ్య అధికంగా ఉండే అవకాశం ఉందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఆస్పత్రుల్లో వివిధ రకాల వైద్య పరికరాలు అందుబాటులో లేక గత నెల రోజులుగా సాధారణ శస్త్రచికిత్సలు నిల్చిపోయినట్టు శ్రీలంక మెడికల్ అసోసియేషన్ (ఎస్‌ఎల్‌ఎంఎ) వెల్లడించింది.

అత్యవసర శస్త్రచికిత్సలు కూడా త్వరలోనే ఆగిపోయే ప్రమాదం పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యం లోనే అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు లేఖ రాసినట్టు ఎస్‌ఎల్‌ఎంఎ పేర్కొంది. కష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నామని, ఎవరికి చికిత్స అందించాలో , సౌకర్యాల కొరత కారణంగా ఎవరికి ట్రీట్‌మెంట్ అందించలేమో తేల్చుకోలేక పోతున్నామని, పరిస్థితులు ఇలాగే ఉంటే కరోనా మరణాల కంటే ఈ సంక్షోభ మరణాలే ఎక్కువగా ఉంటాయని లేఖలో పేర్కొంది. తీవ్ర ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న శ్రీలంకలో రాజకీయ సంక్షోభమూ ముదురుతోంది. అధ్యక్షుడి రాజీనామాను డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు హోరెత్తుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News