పెద్దపల్లి: కాల్వశ్రీరాంపూర్ మండలం జాఫర్‌ఖాన్ పేట గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని పలు మండలాలు, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని తెలిపారు. అలాగే రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చూస్తారని ఆయన పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారిలో మ్యాకల్ శ్రీకాంత్, మాజీ వార్డుమెంబర్ గొర్రె కరుణా కర్, గొర్ల దేవెందర్, గంప రాజు, చేగొండ అజయ్, శనిగారపు రామ్మూర్తి, బోడకుంట మనోజ్, లశెట్టి వరుణ్, పెర్క నర్సయ్య, మ్యాకల సదానందం, సిరాల వెంకటేష్‌లను ఉన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనెటి సంపత్, జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ గజవెల్లి పురుషోత్తం, సర్పంచ్ దొమ్మటి శ్రీనివాస్, ఎంపీటీసీ రమాదేవి రాజమల్లు, గ్రామాధ్యక్షుడు చంద్రయ్య, తిప్పని శ్రావణ్, మార్కెట్ చైర్మన్ రామచంద్రాఎడ్డి, సర్పంచ్‌లు కాసం శ్రీనివాస్‌రెడ్డి, మంద రమా వెంకన్న, మాజీ సర్పంచ్ జక్కే రవి, సిరిపురం శ్రీనివాస్, బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.